బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 67 హైలైట్స్

233
episode 67
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 67 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 67వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యలకు ట్విస్ట్ ఇస్తూ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని బయటకు పంపించాలని కోరగా తర్జనభర్జనల మధ్య అఖిల్ బయటకు (సీక్రెట్ రూం)లోకి వెళ్లారు. తర్వాత సొహైల్,మోనాల్ భావోద్వేగం,అభిజిత్ సంభాషణను సీక్రెట్ రూమ్‌లో నుండి చూస్తు అఖిల్ కౌంటర్ ఇవ్వడంతో ఎపిసోడ్ ముగిసింది.

ఇంటి సభ్యులకు ఝలక్ ఇస్తూ తక్షణమే సూట్ కేస్‌లు అన్నీ సర్దుకోవాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో సూట్‌ కేస్‌లు సిద్ధం చేసుకుని గార్డెన్ ఏరియాకు రాగా ఈసారి ఇంట్లోని ఓ వ్యక్తిని బయటకు పంపే అవకాశాన్ని వారికి ఇచ్చారు. ఫినాలే వరకూ సాగే ప్రయాణంలో ఏ సభ్యుడు అయితే తమకి అడ్డుపడతాడని భావిస్తాడో ఆ సభ్యుడ్ని ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసి బిగ్ బాస్‌‌కి తెలియజేయాలని కోరారు బిగ్ బాస్.

తొలుత వెళ్లిన సొహైల్….మెహబూబ్ పేరు చెప్పగా తర్వాత అరియానా.. అఖిల్ పేరుని,అవినాష్ అరియానా పేరుని,మోనాల్ కూడా అఖిల్‌ పేరుని,మెహబూబ్..అరియానా పేరుని చెప్పగా అభిజిత్, లాస్య, అఖిల్‌లు తమకంటే హౌస్‌లో ఎవరూ స్ట్రాంగ్ అని భావించడం లేదని తెలిపారు.

బిగ్ బాస్ స్ట్రాంగ్ ఎవరో చెప్పాలని అన్నారు కానీ.. ఎవరి పేరు వాళ్లు చెప్పుకోవాలని అనలేదు.. అలా అనుకుంటే నా పేరు నేను చెప్పుకోవచ్చు కదా అని సొహైల్…అభిజిత్‌తో తెలిపాడు. తర్వాత ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో అఖిల్ స్ట్రాంగ్ అని అందుకే అతన్ని పంపించాలనే నిర్ణయానికి రావడంతో అఖిల్‌ని హౌస్ నుంచి బయటకు పంపించడానికి డిసైడ్ అయ్యారు.

అఖిల్‌ని మెయిన్ డోర్ నుంచి బయటకు రావాలని ఆదేశించారు. దీంతో షాక్‌లో ఉండిపోయిన అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను స్ట్రాంగ్ అని చెప్పి బయటకు పంపుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు ఎలిమినేట్ చేస్తే బాధపడేవాడిని కానీ ఇంటి సభ్యులే తనని స్ట్రాంగ్ అని బయటకు పంపించడం సంతోషంగా ఉందని తెలిపాడు అఖిల్.

సీన్ కట్ చేస్తే అఖిల్ వెళ్లింది సీక్రెట్ రూమ్‌లోకి. ఇది తెలియని ఇంటి సభ్యులు ముఖ్యంగా సొహైల్,మోనాల్ తెగ బాధపడిపోయారు. అయితే సీక్రెట్ రూమ్‌లో నుండి అభిజిత్,మోనాల్‌ మాటలను చూస్తున్న అఖిల్ వారికి ఫన్నీ సెటైర్లు వేశాడు. ఇక మోనాల్ అయితే అఖిల్ లేడన్న బాధను తట్టుకోలేకపోయింది.. ఎక్కడైతే కెమెరా బాగా ఫోకస్ అవుతుందో చూసి కూర్చుని మరీ కెమెరా ముందు మాట్లాడటం మొదలుపెట్టింది. సారీ అఖిల్.. ఫెయిర్ గేమ్ అన్నారు.. అందుకే నేను ఫెయిర్ గేమ్ ఆడుతున్నా అంటూ తెగ ఏడ్చేసింది.

- Advertisement -