బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 44 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 44 ఎపిసోడ్ ఏడోవారంలో ఎలిమినేషన్స్‌కి నామినేషన్ కావడంతో ఉన్న ఇంటి సభ్యుల్లో నోయల్ డైరెక్ట్‌గా ఎలిమినేట్ కాగా అమ్మరాజశేఖర్ మాస్టర్ ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యారు. ఇక మిగితా సభ్యులను జంటలుగా విడదీసిన బిగ్ బాస్ ఇందులో ఎవరూ ఎలిమినేట్ అవుతారో చెప్పాలన్నారు. దీంతో మోనాల్,అవినాష్,అరియానా,అభి,దివిలు నామినేట్ కావడంతో ఎపిసోడ్ ముగిసింది.
తొలుత మార్నింగ్ వేకప్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేశారు ఇంటి సభ్యులు. కుమార్ సాయి విసిరిన బిగ్ బాంబ్‌తో వాష్ రూమ్స్ క్లీన్ చేస్తూ రాజశేఖర్ మాస్టర్ కనిపించగా హారికను టీజ్ చేస్తూ అవినాష్ ఆటాడుకున్నాడు. అభి-మోనాల్ మాట్లాడుకోవాలని అరియానా అభి ముందు ప్రతిపాదన తీసుకురాగా అభి పట్టించుకోలేదు. ఈ విషయంపై నోయల్, లాస్య,హారికలతో చర్చించిన అభిజిత్…అరియానాకు ఎందుకంత అంటూ నోరుజారాడు.
ఇక ఏడోవారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న నోయల్ డైరెక్ట్‌గా నామినేట్ కాగా అమ్మా రాజశేఖర్ గుండుకొట్టించుకునే డీల్ ఓకే చేసినందుకు ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యాడు. మిగిలిన 10 మంది రెండు రెండు జంటలుగా విడిపోయి ఒక్కో జంట స్టాండ్స్ దగ్గరకు వెళ్లి నిలబడి ఆ ఇద్దర్నో ఎవరు సేవ్ కావాలి? ఎవరు నామినేట్ కావాలో తేల్చుకోవాలని.. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత సేవ్ అయిన వ్యక్తి.. నామినేట్ అయిన వ్యక్తిపై స్టాండ్‌కి ఉన్న బకెట్‌లోని పెయింట్ వేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్.
అఖిల్-మోనాల్, హారిక-అభిజిత్, సొహైల్-అవినాష్, దివి-లాస్య, మెహబూబ్-అరియానా వెళ్లి నిలుచోగా తొలుత భారీ చర్చల అనంతరం అఖిల్ కోసం మోనాల్ త్యాగం చేసింది. తర్వాత సొహైల్-అవినాష్ ఇద్దరూ నామినేషన్‌కి ఒప్పుకోకపోవడంతో చాలాసేపు చర్చ నడిచింది. చివరగా అవినాష్ కాంప్రమైజ్ కావడంతో ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.
అభిజిత్-హారికలో అభిజిత్,లాస్య-దివిల్లో దివి ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఇక చివరగా అరియానా-మెహబూబ్‌లు ఎంతకీ వెనక్కి తగ్గలేదు.ఇద్దరు తనకు హౌస్‌లో ఉండాలని ఉంది అంటే తనకు ఉండాలని ఉందని భీష్మించుకుని కూర్చున్నారు. కానీ చివరగా వెనక్కి తగ్గిన అరియానా నేను నామినేట్ అవుతున్నా బిగ్ బాస్.. కానీ నాకు మెహబూబ్ హెల్ప్ అవసరం లేదని తేల్చిచెబుతూ కంటతడి పెట్టింది. దీంతో ఏడోవారంలో నోయల్, అభిజిత్,అవినాష్, దివి, అరియానా, మోనాల్‌లు నామినేట్ అయ్యారు.