బిగ్ బాస్ ఎపిసోడ్ 34 హైలైట్స్‌…

116
episode 34

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 344 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల భావోద్వేగం,అవినాష్,గంగవ్వ కంటతడి పెట్టించడం,బిగ్ బాస్ ఆత్మ అవినాష్‌లో ప్రవేశించడం వంటి అంశాలతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఉదయాన్నే పాటతో నిద్రలేచిన ఇంటి సభ్యులు డ్యాన్స్‌తో రచ్చ చేశారు. ముఖ్యంగా అభి-హారికకు హగ్ ఇవ్వగా అఖిల్‌‌- మోనాల్ గట్టిగా కౌగిలించుకుని రచ్చరచ్చ చేశారు. ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులు తమ ఎమోషనల్ స్పీచ్‌తో ఇంప్రెస్ చేశారు.

మొదటగా వచ్చిన నోయల్ తన తల్లి గురించి అద్భుతంగా చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నానంటే మా అమ్మే కారణం అంటూ ఎమోషనల్‌ కాగా లాస్య కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తాను అమ్మను అయ్యేంతవరకూ నాకు అమ్మ విలువ తెలియలేదు.. నేను మా అమ్మను ప్రేమిస్తాను. నాకు నార్మల్ డెలివరీ.. 14 గంటలు పెయిన్స్ భరించిన తరువాత నా చేతుల్లోకి నా కొడుకు వచ్చాడు.. వాడిని చూడగానే ఆ బాధనంతా మరిచిపోయా అమ్మతనాన్ని చాలా ఎంజాయ్ చేశానని ఏడ్చేసింది.

ఇక తర్వాత వచ్చిన వచ్చిన లాక్ డౌన్‌లోవచ్చిన ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపి షాకిచ్చాడు. కొత్తగా ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చానని అప్పుడు తన తండ్రికి హార్ట్ ఆపరేషన్ జరగడంతో డబ్బు ఖర్చు అయిపోవడంతో రూ. 13 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని తెలిపారు. నెలకు 45 వేలు ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానని అయితే తన పేరెంట్స్ కోసం డబ్బు ఖర్చు చేయడం ఆనందం అనిపించిందని చెప్పాడు. అమ్మనాన్నలను అందరూ బాగా చూసుకోండని తెలిపిన అవినాష్ వారిని వృద్ధాశ్రమాల్లో వదిలేకయకండని తెలిపాడు.

ఇక తర్వాత వచ్చిన గంగవ్వ కూడా తన బాధను చెబుతూ కంటతడి పెట్టేసరికి ఇంటి సభ్యులంతా ఓదార్చారు. తాను చదువుకోలేదు 5 ఏళ్లకే పెళ్లి చేశారు.. 15 ఏళ్లకు కొడుకు పుట్టాడు.. కొడుకు పుట్టాక భర్త తాగుడు తాగి కొట్టడం మొదలుపెట్టాడు.తర్వాత రెండేళ్లకే బిడ్డ పుట్టింది. అన్నికష్టాలు పడుకుంటూ తన బిడ్డలను పెంచానని అయితే ఒకరోజు రాత్రి పిట్స్‌ రావడంతో తన బిడ్డను ఎత్తుకుని హాస్పిటల్‌కి వెళ్లానని అప్పటికే తన బిడ్డచనిపోయిందని చెబుతూ ఇంటి సభ్యులందరి చేత కంటతడి పెట్టించింది గంగవ్వ. అయితే సభ్యులంతా గంగవ్వను ఓదార్చుతూ మేమంతా మీ మనవళ్లు,మనవరాళ్లమని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

తర్వాత రాజశేఖర్ మాస్టర్‌..అవినాష్‌కు క్లాస్ పీకాడు. ఇంటి ఈఎంఐ కట్టలేదని చనిపోదాం అనుకున్నావా?? ఛీ ….తాను రూ. 6 కోట్లు ఇళ్లు కొన్నా.. మళ్లీ అలాగే అమ్మేసే.. ప్రతిఒక్కడికీ కష్టం వస్తుంది.. అందరూ చనిపోతున్నారా? ఇంకొఎంటే చంపేస్తా అని తెలిపాడు. తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఫిజికల్ టాస్క్‌లో అఖిల్,మెహబూబ్‌ పోటీపడగా అఖిల్ 11 కార్డ్స్ సంపాదించగా,మెహబూబ్ 12 కార్డ్స్ సంపాదించాడు. గెలిచిన వ్యక్తి హౌస్‌లోని ఒక సభ్యుడితో మసాజ్ చేయించుకోవాలని తెలపడంతో మెహబూబ్‌…మోనాల్‌తో మసాజ్ చేయించుకుంటూ థ్యాంక్స్‌ బిగ్ బాస్‌ అంటూ తెగ ఎంజాయ్ చేశాడు. ఇక కంటికి కనిపించిన బిగ్ బాస్‌ ఆత్మ అవినాష్ శరీరంలోకి ప్రవేశిస్తుందని ఇంటి సభ్యులంతా ఎలాంటి ప్రశ్ననలైనా అడగొచ్చని తెలిపారు బిగ్ బాస్‌. ఒక్కో కంటెస్టెంట్ గురించి ఫన్నీగా చెబుతూ అందరిని ఇంప్రెస్ చేశారు అవినాష్.

హౌస్‌లో నడుస్తున్న ట్రై యాంగిల్ లవ్ స్టోరీపై మోనాల్ దగ్గర ప్రస్తావన తీసుకుని వచ్చింది దివి. మీ ముగ్గురు మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ.. అఖిల్, అభిజిత్‌లు మోనాల్‌కి నేనంటే ఇష్టం అనే అనుకుంటున్నారు. ఇద్దరి మైండ్‌లో నువ్వంటే ఇష్టం అని క్రియేట్ చేయడం నీ మిస్టేక్ అంటూ కుండబద్దలుకొట్టేసింది. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌ నుండి ఒకరు ఎలిమినేట్ కానుండటంతో ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్లనున్నారో అనేది ఆసక్తికరంగా మారింది.