బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 32 హైలైట్స్‌

155
bigg boss 4

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా 32 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 32వ ఎపిసోడ్‌లో బీబీ హోటల్ టాస్క్ కంటిన్యూ కాగా ఇంటి సభ్యుల మధ్య రొమాన్స్‌,మటన్ కర్రీలో హెయిర్ కనిపించడం, అన్ని కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉండటం,చివరగా అమ్మా రాజశేఖర్- అభిజిత్‌ల మధ్య మాటల యుద్ధంతో ముగిసింది.

ఇక సీక్రెట్ టాస్క్‌లో మటన్ కర్రీలో ఎంట్రుకలు, పిన్ వేశాడు అవినాష్ . అది సొహైల్‌కి కనిపించడంతో రచ్చ రచ్చ చేశాడు. హోటల్ టీం నువ్వే పిన్ పెట్టావని అనడంతో గాడ్ ప్రామిస్‌గా తాను పెట్టలేదని గొడవకు దిగాడు సొహైల్. హోటల్ టీంలో ఉన్న రాజశేఖర్ మాస్టర్‌తో ఆటాడుకున్నారు గెస్ట్‌లు.స్విమ్మింగ్ పూల్‌లో 100 సార్లు దూకాలని టాస్క్ ఇచ్చారు. కొద్దిసేపు కాగానే సొమ్మసిల్లి పడిపోయాడు మాస్టర్. తర్వాత అఖిల్‌కి 150 పుష్ ఐప్ చేయాలని టాస్క్ ఇచ్చారు గెస్ట్‌లు.. అయితే అఖిల్ అతి కష్టం మీద 75 మాత్రమే తీయగలిగాడు. తర్వాత అభిజిత్‌తో 20 కేజీలు ఎత్తించి 60 పుష్ అప్‌లు తీయించారు.

ఇక హోటల్ స్టాఫ్‌లో ఉంటూనే వాళ్లకి గెస్ట్‌ల దగ్గర నుంచి స్టార్లు రాకుండా ఫుడ్‌లో ఉప్పు, పిన్‌లు కలిపి తన టాస్క్‌ని కంప్లీట్ చేశాడు అవినాష్‌. గెస్ట్‌లు ఎంతకీ స్టార్లు,టిప్పు ఇవ్వకపోవడంతో వాళ్లకి ఫుడ్ పెట్టొద్దు అని లాస్య తన టీం సభ్యులతో చెప్పింది. అయితే ఫుడ్ పెట్టకపోవడంపై హోటల్ టీం సభ్యులతో గొడవకు దిగారు మెహబూబ్‌.

ఈ క్రమంలో ఒక్కొక్కడికీ పుచ్చలు పగిలిపోతాయి అని మెహబూబ్ వార్నింగ్ ఇవ్వడంతో గొడవ కాస్త పెద్దదైంది. తొలుత అఖిల్, తర్వాత అవినాష్‌…మెహబూబ్‌తో వాదనకు దిగారు. మేమూ మగాళ్లమే మాకు మీసాలు ఉన్నాయి.. నీకు కండలు ఉన్నంత మాత్రాన ఎవడూ భయపడిపోడు.. కాస్త డీసెంట్‌గా బిహేవ్ చేయి అంటూ వార్నింగ్ ఇచ్చారు అవినాష్‌.

తర్వాత సొహైల్..మెహబూబ్‌తో నువ్వు అలా అనాల్సి ఉండకూడదని చెప్పడంతో అఖిల్‌కి సారీ చెప్పిన మెహబూబ్‌ తర్వాత అవినాష్‌కి 1000 టిప్ ఇచ్చాడు. అభిజిత్-హారికలు వేరు వేరు టీంలలో ఉన్నప్పటికీ ఇక్కడ కూడా కలిసే గేమ్ ఆడారు. తన దగ్గర ఉన్న స్టార్‌ని అభిజిత్‌ కోసం త్యాగం చేసింది హారిక.

ఫైవ్ స్టార్లను గెస్ట్‌లను మెప్పించి తీసుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇస్తే అభిజిత్ వాటిని తన దగ్గరే పెట్టుకుని గెలిచేశాం అంటూ గుసగుసలాడగా కెమెరా ముందుకు వచ్చి తాను కేవలం ఒక స్టార్ మాత్రమే ఇచ్చానని తెలిపింది హారిక. తర్వాత హారిక ,అభిజిత్ రొమాంటిక్ ముచ్చట్లు.. అభి సేవల్ని ఉపయోగించుకుంటూ అతనితో మసాజ్ చేయించుకుంది.

అప్పటిదాక ఒక్కటిగా ఉన్న రాజశేఖర్ – అభిల మధ్య టిప్ డబ్బులు షేర్ విషయంలో వివాదం జరిగింది. నేను మేనేజర్‌ని వాళ్లకి సర్వీస్ చేయడం మానేయమని చెప్తుంటే నువ్వు ఎందుకు వినవు.. అంటూ అభి ఆర్డర్ వేయడంతో రాజశేఖర్ మాస్టర్ నువ్ చెప్తే నేను వినాలా? నేను వాళ్లకి చేసి పెడతా అంటూ గెస్ట్‌లకు వండి పెట్టి టిప్ సంపాదించాడు. తర్వాత సుజాత వంట సామాన్లు దాచి పెట్టేసి నేను ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఫైర్ అయ్యింది. ఇక మోనాల్‌తో మసాజ్ చేయించుకుని గోర్లు కట్ చేయించుకున్నాడు సొహైల్.