చెన్నై పై కోల్ కతా గెలుపు

169
csk

ఐపీఎల్ 2020లో భాగంగా మూడో విజయాన్ని నమోదుచేసింది కోల్ కతా నైట్ రైడర్స్‌. అబుదాబి వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్లు కొల్పోయి 157 పరుగులు చేసింది. దీంతో కోల్ కతా టోర్నమెంట్ లో మూడో విజయాన్ని నమోదుచేసింది.

168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. డుప్లెసిస్ 17 పరుగులు చేసి ఔటైనా షేన్ వాట్సన్,అంబటి రాయుడు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా వాట్సన్ అర్ధసెంచరీతో రాణించగా రాయుడు 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో చెన్నై విజయం ఖాయమనుకున్న టైంలో ఒక్కసారిగా మ్యాచ్‌ టర్న్ అయింది. వాట్సన్‌ 50,ధోని 4,సామ్ కర్రన్ 17 పరుగులు చేసి

ఔటవడంతో చెన్నై కష్టాల్లో పడింది. చివరలో చేయాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో చెన్నై బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా 20 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌటైంది. బర్త్ డే బాయ్ రాహుల్ త్రిపాఠి రాణించడంతో కోల్ కతా గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. రాహుల్ త్రిపాఠి 51 ఓవర్లలో 3 సిక్స్‌లు,8 ఫోర్లతో 81 పరుగులు చేసి రాణించాడు.

శుభమన్ గిల్ 11,రాణా 9,సునీల్ నరైన్ 17,మోర్గాన్ 7,రస్సెల్ 2,కార్తీక్ 12,పాటిన్సన్ 17 పరుగులు చేశారు. 11 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను దాటిన కోల్ కతా చివరి 9 ఓవర్లలో కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. బ్రావో 3,కరన్ శర్మ,సామ్ కర్రాన్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీశారు.