తగ్గిన బంగారం ధరలు..

158
Gold Rate

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.52,410కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.48,050కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1800 తగ్గి రూ.62,200కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం తగ్గుదలతో 1888 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం తగ్గుదలతో 23.87 డాలర్లకు చేరింది.