బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 19 హైలైట్స్‌

167
episode 19
- Advertisement -

బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 19 హైలైట్స్‌ బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 19 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఇక 19వ ఎపిసోడ్‌లో రోబో- మనుషుల టీం సభ్యుల మధ్య ఉక్కు హృదయం టాస్క్‌ గలాట,రోబో టీం గెలవడం,నోయల్ వరెస్ట్ పర్ఫార్మర్‌గా నిలిచి జైలుకి వెళ్లడం ఈ ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలిచాయి.

తొలుత రోబోల టీం నుంచి అవినాష్ వచ్చి మనుషుల టీంతో మాటలు కలిపాడు. చార్జింగ్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. కుదరదని చెప్పడంతో రోబోలకు చార్జింగ్ పెట్టుకోవడం ఎలా అన్నదానిపై ఆలోచనలు చేశారు. ఇక అవినాష్ రాజశేఖర్ మాస్టర్‌ని ముగ్గులోకి దింపి మెల్లగా మాటలు కలిపి చార్జింగ్ పెట్టేసుకున్నాడు. దీంతో రాజశేఖర్ మాస్టర్ మైండ్ బ్లాక్ అయ్యింది.. పక్కన కూర్చుని నమ్మక ద్రోహం చేస్తావారా అవినాష్.. లైఫ్‌లో నీతో మాట్లాడనురా.. నాశనం అయిపోతారు మీరు అంటూ శాపనార్థాలు పెట్టారు రాజశేఖర్ మాస్టర్.

అయితే మనుషుల టీంలో ఉన్న సుజాత తనకు వాష్ రూం అర్జెంట్ అని సోహైల్‌తో వాదనకు దిగింది. ఇక గంగవ్వ డ్రెస్‌ను మొనాల్ లాక్కోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్వరూపం చూపించింది గంగవ్వ. మొనాల్‌పై కుర్చి ఎత్తి విసిరేసింది. తర్వాత తనకు చార్జింగ్ ఇస్తే తినడానికి తిండి, నీళ్లు పెడతానని మాట తీసుకుని వాళ్లకు తిండిపెట్టి చార్జింగ్ తీసుకుంది గంగవ్వ. అయితే రోబోలుగా ఉండి మనుషుల దగ్గర నుంచి చార్జింగ్ తీసుకోవడంలో విఫలమైన అరియానా, కుమార్ సాయి, అవినాష్, లాస్య‌లు చనిపోయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. రోబో టీంలో అభిజిత్, గంగవ్వల బ్యాటరీల చార్జింగ్‌లు ఇంకా అలాగే ఉండటంతో రోబో టీంను విజేతలుగా ప్రకటించారు.

తర్వాత టాస్క్‌లో గెలిచిన రోబో టీం నుండి నలుగురు బెస్ట్ పెర్ఫార్మర్‌లను ఎన్నుకోవాలని ఈ వారం వీరి నుండే కెప్టెన్ అవుతారని తెలపగా గంగవ్వ, అభిజిత్, హారిక, అవినాష్‌లు నలుగురూ బెస్ట్ పెర్ఫామర్లుగా ఎంపిక చేసుకున్నారు. ఇక ఓడిపోయిన మనుషుల టీంలో నుంచి ఒక వరస్ట్ పెర్ఫామర్ పేరు చెప్పాలని చెప్పాలని కోరగా అంతా నోయల్ పేరు చెప్పారు. దీంతో నోయల్‌కి జైలు శిక్ష పడింది.జైల్లో ఉన్న నోయల్‌కి అందరిలా ఫుడ్ ఇవ్వకూడదని అతనికి కేవలం రాగి జావ మాత్రమే ఇవ్వాలని.. రాగి పిండి కూడా చేయాల్సిన శిక్షను నోయల్‌కి విధించారు బిగ్ బాస్.

- Advertisement -