ఆర్సీబీ ఘోర పరాజయం..

139
punjab

ఐపీఎల్ 13లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.పంజాబ్ విధించిన 207 పరుగుల లక్ష్యచేదనలో తేలిపోయింది కోహ్లీ సేన. కేవలం 109 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది.

భారీ టార్గెట్ ఉండటంతో ఒత్తిడికి లోనైన ఆర్సీబీ ఆటగాళ్లు ఏ మాత్రం పోరాటం చేయకుండానే వెనుదిరిగారు. ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్‌(20), డివిలియర్స్‌(28), వాషింగ్టన్‌ సుందర్‌(30), శివం దూబే(12)లు రెండంకెల స్కోరు చేయగా విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరచ్చాడు. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో రవి బిష్నోయ్‌, మురుగన్‌ అశ్విన్‌లు చెరో మూడు వికెట్లు సాధించగా, షెల్డాన్‌ కాట్రెల్‌ రెండు వికెట్లతో మెరిశాడు. ఇక షమీ, మ్యాక్స్‌వెల్‌లు వికెట్‌ చొప్పున తీశారు.

అంతకముందు టాస్ గెలిచిన కోహ్లీ….పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫెయిలైన రాహుల్‌.. ఆర్సీబీ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్న రాహుల్ తన ఐపీఎల్ హిస్టరీలో తొలి సెంచరీ నమోదుచేశాడు. 62 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ చేసిన రాహుల్… 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.