మళ్లీ తెరపైకి చిల్లర కామెడీ..రచ్చ రచ్చ!

121
avinash

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 58 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. ఇక సోమవారం ఎపిసోడ్ కావడంతో నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఎవరి పేరు చెప్తారో వాళ్లు వెళ్లి ఇద్దరి తలపై కోడు గుడ్లు పగలకొట్టాల్సి ఉంటుందని చెప్పారు.

అవినాష్ పేరు చెప్పగానే మొదటి గుడ్డుని అభిజిత్‌పై కొట్టాడు. నోయల్ చిల్లర కామెడీ అని అన్నప్పుడు నువ్వు లేచి సీరియస్ అవ్వడం నాకు నచ్చలేదు. నోయల్ పర్సనల్‌గా నన్ను టార్గెట్ చేసినప్పుడు మీరు మధ్యలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదనే రీజన్ చెబుతు నామినేట్ చేశారు అవినాష్.

తర్వాత అభిజిత్ వంతు రావడంతో అవినాష్‌ని నామినేట్ చేస్తూ రీజన్ చెప్పే ప్రయత్నం చేశాడు అభిజిత్. ఎప్పుడూ నేను ఎంటర్ టైన్మెంట్ చేస్తా, హెల్దీగా చేస్తా అని మీరు అనుకుంటారు తప్పితే.. నాకు అలా అనిపించదు. నువ్ కామెడీ చేయడానికి వచ్చి ఉండొచ్చు.. కానీ మేం కామెడీ తీసుకోవడానికి రెడీగా లేము.. కామెడీ ఆపేస్తే బాగుంటుందని అవినాష్‌కి చెప్పాడు.

అయితే నేను ఇక్కడకి కమెడియన్‌గా ఎంటర్‌టైన్ చేయడానికే వచ్చా.. చేస్తా నువ్ వద్దు అనుకుంటే రాకూడదు.. ప్రాణం పోయే వరకూ పెర్ఫామెన్స్ చేస్తా.. నువ్వేం చేయకుండా కూర్చుంటావ్.. నన్ను కామెడీ చేయొద్దని చెప్పడానికి నువ్ ఎవడివి? అంటూ అభిపై అవినాష్‌ ఫైర్‌ అయ్యాడు. తర్వాత చాలాసేపటి వరకు అభి- అవినాష్ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది.