జబర్దస్త్‌లోకి మళ్లీ తసుకోమన్నారు..అవినాష్ కంటతడి!

103
nominations

బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాస్టర్- అభిజిత్‌ల మధ్య మాటల యుద్దం, అవినాష్ కంటతడి,కొట్టుకున్నంత పని చేశారు అఖిల్ – సొహైల్. ఇక మోనాల్‌ని నామినేట్ చేస్తూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు అఖిల్.

ఇక నామినేషన్స్ పూర్తయిన తర్వాత అవినాష్‌ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఇంత‌వ‌ర‌కు ప‌డ్డ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయ్యింద‌ని…. ఎన్నో అవ‌మానాలు ప‌డి వ‌చ్చాను. మ‌ళ్లీ ఆ షో(జ‌బ‌ర్ద‌స్త్‌)లోకి తీసుకోమ‌ని చెప్పారు. అవ‌న్నీ గుర్తొచ్చాయ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు.

మ‌రోవైపు అఖిల్ చేసిన మోసానికి మోనాల్ కుంగిపోయింది. నేను హ‌ర్ట్ అయ్యాను అఖిల్, నువ్వు న‌న్ను న‌మ్మ‌నందుకు బాధ‌ప‌డుతున్నాన‌ని చెప్పుకొచ్చింది. నీ గేమ్ నువ్వు ఆడు అని మొద‌టి నుంచే చెప్తున్నా, ఇక నుంచి నీకు నేను స‌పోర్ట్‌గా ఉంటా అని మోనాల్‌కు హామీ ఇచ్చాడు మాస్టర్‌.