అఖిల్‌ కోసం మోనాల్‌ త్యాగం!

231
monal

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4 విజయవంతంగా 7 వారంలోకి అడుగుపెట్టింది. ఏడవ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఆరుగురు సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. తొలుత జంటలుగా విడిపోయి ఒకరు ఎలిమినేషన్‌కు నామినేట్ కావాలని చెప్పగా అఖిల్ కోసం త్యాగం చేసింది మోనాల్.

నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా అఖిల్‌, మోనాల్‌ ఇద్దరు తాము ఎందుకు హౌస్‌లో ఉండాలనుకుంటున్నారో వివరించారు. నేను ఎక్కువ సార్లు నామినేట్ అయ్యా.. నువ్ ఫిజికల్ స్ట్రాంగ్ కాబట్టి నన్ను సేవ్ చేయమని అఖిల్‌ని అడిగింది మోనాల్.

నేను ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ అదే ఎనర్జీతో ఆడుతున్నా.. నేను చాలా బాగా ఆడుతున్నా.. ఇంట్లో ఉండాలంటే బాగా ఆడేవాళ్లు ఉండాలి కాబట్టి.. నేను సేవ్ కావాలనుకుంటున్నా.. నువ్ నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు అంటూ తెలిపాడు అఖిల్. దీనికి అంగీకరించిన మోనాల్‌..నామినేట్‌ అవ్వడానికి సిద్దపడింది. తర్వాత ఎప్పటిలాగే ఓ ఘాటు కౌగిలింత ఇచ్చిన అఖిల్ .. మోనాల్‌పై పెయింటింగ్ బకెట్ ఒంపేసి ఎలిమినేషన్‌ నుండి సేవ్ అయ్యాడు.