మంచి మనుషులకు చుక్కలు చూపించిన అరియానా!

104
ariyana

బిగ్ బాస్ 4 తెలుగు విజయవంతంగా 46 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా 46వ ఎపిసోడ్‌లో మంచి మనుషుల టీంకు చుక్కు చూపించింది అరియానా.రాక్షసుల టీంలో మెహబూబ్, అరియానా, అవినాష్ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా మంచి మనుషులకు చెమటలు పట్టించారు. ముఖ్యంగా అరియానా రాక్షస అవతారంలో జీవించేసింది. ఆ పాత్రలో లీనమై పోయిన అరియానా ఇంటి సభ్యుల్ని అల్లాడించింది. నిజంగా రాక్షసిలానే ప్రవర్తించి మంచి మనుషుల సహనానికి పరీక్ష పెట్టింది.

ఇక కొంటే రాక్షసులు- మంచి మనుషులు టాస్క్‌లో మంచి మనుషులు గెలుపొందడంతో ఇక ఈ టాస్క్‌ని సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసిన ఇంటి సభ్యుల్ని అభినందిస్తూ ఇద్దరు బెస్ట్, ఇద్దరు వరెస్ట్ పెర్ఫామర్ల పేర్లు చెప్పాలని కోరారు బిగ్ బాస్‌. ఇది మేం చెప్పలేం అని అందరం బాగా ఆడాము.. మీరే డిసైడ్ చేయండని ఇంటి సభ్యులు కోరారు. అయితే బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయిన నోయల్ ఇద్దరు పేర్లు చెప్పాలని లేదంటూ ఇంటి సభ్యులంతా నేరుగా నామినేట్ అవుతారని చెప్పారు బిగ్ బాస్.

దీంతో ఈ మొత్తం టాస్క్‌లో తమకు చుక్కలు చూపించిన అరియానా,అవినాష్‌లను బెస్ట్ పెర్ఫామర్లుగా ప్రకటించారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు వీరు మంచి మనుషులను ఎంత ఇబ్బంది పెట్టారో.