నువ్వు తోపు కాదు..అఖిల్ వర్సెస్ మెహబూబ్‌

34
akhil

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 46 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 46వ ఎపిసోడ్‌లో భాగంగా కొంటె రాక్షసులు- మంచి మనుషులు టాస్క్‌లో భాగంగా హౌస్‌లో ఫ్రెండ్స్‌గా ఉంటున్న అఖిల్- మెహబూబ్ మధ్య మాటల యుద్దం జరిగింది.

టాస్కులో చాలా క్రూర‌త్వంగా ప్ర‌వ‌ర్తిస్తున్నావ‌ని అఖిల్ మెహ‌బూబ్‌ను అన్నాడు. న‌న్ను ఆప‌లేక అంటున్నావా? అని అత‌డు రివ‌ర్స్ కౌంట‌రివ్వ‌డంతో “నువ్వు పెద్ద తోపు, తురుము ఏం కాదు, ద‌మ్ముంటే నా దగ్గ‌రకు రా” అని అఖిల్‌ స‌వాలు విసిరాడు. పలుమార్లు ఇద్దరి మధ్య ఈ టాస్క్‌లో మాటల యుద్దం జరుగుతూనే ఉంది.

చివ‌రాఖ‌ర‌కు ఈ టాస్కులో మంచి మ‌నుషుల టీమ్ గెల‌వ‌డంతో అవినాష్‌ను త‌మ‌లో కలుపుకుపోయారు. అయితే ఏదిఏమైనా తొలి నుండి అఖిల్-మెహబూబ్-సొహైల్ ఒక టీంగా ఆడుతుండగా అఖిల్- మెహబూబ్ మధ్య మొదలైన ఈకాంట్రవర్సీ ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాలి.