బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్!

190
gold rate

గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మంగళవారం మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ. 237 తగ్గి 50,870 రూపాయలకు చేరగా వెండి కిలోకు 525 రూపాయలు పతనమై 62,573కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర ఔన్స్‌కు 1919 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితులు, ఉద్దీపన ప్యాకేజ్‌లపై అస్పష్టతతో బంగారం ధరలు మరికొంత కాలం ఒడిదుడుకులతో సాగుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు