బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 7 హైలైట్స్

236
bigg boss
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్‌ విజయవంతంగా 7 ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. శని,ఆదివారం కావడంతో హోస్ట్ నాగార్జున తిరిగి దర్శనమిస్తూ అందరినీ పేరుపేరున పలకరించారు.ఈ సరదా మాటల తరవాత హౌజ్‌మేట్స్ మధ్య కనెక్షన్స్ గురించి నాగార్జున అడిగారు. ఒక్కో జంట మధ్య కనెక్షన్ ఎలా ఉందో అడిగి వారికి పీకాల్సిన క్లాస్ పీకేశారు. నైబర్ హౌజ్‌తో నోయల్ మాట్లాడిన తీరు చాలా బాగుందని నాగార్జున కొనియాడారు. అయితే, నోయల్‌కు ఓవర్ థింకింగ్ ఉందని అన్నారు.

కరాటే కళ్యాణిపై నాగార్జున ఫైర్ అయ్యారు. కళ్యాణి నువ్వు చాలా ఎక్కువ ఆలోచించి ఫీలైపోతున్నావ్. అనవసరంగా ఫీలవుతున్నావు. వేరే వాళ్లు మాట్లాడుతుంటే వాళ్లను మాట్లాడనివ్వవు. వాళ్లను మాట్లాడనివ్వవు.. మీద ఎక్కేస్తావ్ అని సున్నితంగా క్లాస్ పీకారు నాగార్జున.తొలిరోజు వేదికపై 50 బస్కీలు తీసిన అఖిల్‌కు నాగార్జున ఛాలెంజ్ విసురుతూ ఇస్మార్ట్ సోహైల్‌తో బస్కీలు తీయించారు. అంటే, సోహైల్ మీద అరియానాను కూర్చోబెట్టి తీయించారు. అంత అందమైన అమ్మాయి కూర్చుంటే నేను కూడా తీస్తానని అఖిల్ అన్నాడు. అఖిల్ గంగవ్వను చూసుకునే తీరు చాలా బాగుందని నాగార్జున కొనియాడారు. నైబర్ హౌజ్ నుంచి వచ్చిన సోహైల్, అరియానాతో చిన్న సరదా గేమ్ ఆడించారు నాగార్జున.

యాంకర్ లాస్య గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందని నాగార్జున చురకంటించారు. అభిజిత్ దగ్గరకి వచ్చిన నాగార్జున.. కోపం తగ్గించుకోవాలని సూచించారు. అయితే, తన కనెక్షన్ దేత్తడి హారికతో తాను చాలా బాగా కనెక్ట్ అయ్యానని అభిజిత్ చెప్పాడు.ఎలిమినేషన్‌లో మొదట సేఫ్ అయింది అభిజిత్ తర్వాత జోర్దార్ సుజాత,గంగవ్వ సేఫ్ జోన్‌లోకి వెళ్లగా ఇక మిగిలిన నలుగురులో ఎలిమినేట్ అయ్యే వివరాలను ఇవాళ వెల్లడిస్తానని నాగార్జున చెప్పారు.

- Advertisement -