ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా..

127
amith shah

మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.కొవిడ్ నుంచి కొలుకున్న తర్వాత గడచిన నెలలో ఎయిమ్స్ లో చికిత్స పొందిన అమిత్ షా….నిన్న అర్థరాత్రి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో మరోమారు ఎయిమ్స్ లో చేరారు.

ఆగస్టు 2న కరోనాతో గుర్‌గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. కరోనా నుండి కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పూర్తిగా కోలుకున్న తర్వాత కొద్దిరోజుల క్రితం ఆయన్ని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అయితే తిరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్‌లో చేరారు.