బిగ్ బాస్ 4….ఎపిసోడ్ 5 హైలైట్స్

145
bigg boss episode 5

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా నాలుగురోజులు పూర్తి చేసుకుంది. గంగవ్వ ఎంటర్‌టైన్మెంట్, దివి అదరగొట్టడం,కట్టప్ప ఎవరనే దానిపై చర్చల మధ్య ఎపిసోడ్ 5 ముగిసింది. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న దివి….ఇంటి సభ్యుల గురించి తెలపాలని కోరగా ఒక్కొక్కరి గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.మొదటిగా అకిల్‌తో మొదలుపెట్టిన దివి….. అఖిల్ మోడల్, యాక్టర్ కావడంతో.. తన బిహేవియర్, వాకింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది మార్చుకుంటే మంచిదని చెప్పింది. అభిజిత్‌కి కాస్త కోపం తగ్గించుకుంటే మంచిదని.. లాస్య చాలా వరకూ సెన్సిటివ్ అని ప్రతిది పర్సనల్‌గా తీసుకుంటుందని.. హారిక చాలా యాక్టివ్‌గా ఉంటుంది కాని వయసుని బట్టి గౌరవం ఇస్తే మంచిందని తెలిపింది.

ఇక మొనాల్ హైపర్ యాక్టివ్ అని ప్రతి చిన్న విషయానికి ఏడ్చేస్తుందని ఏడ్వకుండా ఉంటే మంచిదని చురకలంటించగా నోయల్ పక్కా గేమ్ ప్లాన్‌తో వచ్చినట్టు అనిపిస్తుందని తెలిపింది దివి. కళ్యాణి కాస్త ఓవర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని.. సూర్యకిరణ్ తన కోపాన్ని తగ్గించుకుంటే మంచిదని..రాజశేఖర్ హౌస్‌లో మోస్ట్ ఎంటర్ టైనర్ అని కొన్నిసార్లు కుళ్లు జోకులు వేస్తున్నారని తెలపగా ఇక గంగవ్వ గురించి మాట్లాడుతూ పక్క వాళ్లు ఏడిస్తే ఏడ్చేస్తుందని చెప్పింది.. దీంతో గంగవ్వ అదిరిపోయే పంచ్ ఇచ్చింది. వాళ్లు ఏడిస్తే నాకు బాధరాదా?? ఏడవద్దు అంటావ్.. అంటూ పంచ్ ఇచ్చింది.మొత్తంగా కంటెస్టెంట్‌ల గురించి తన మనసులోని మాటను చెప్పేసింది దివి.

తర్వాత గతంలో లాగానే ఇంట్లోని కట్టప్ప గురించి తెలుసుకునే బాధ్యతలను సొహైల్,అరియానాలకు అప్పగించిన బిగ్ బాస్..ఒక్కొక్కరిని పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. యాంకర్ దేవి అసలు కట్టప్పే లేడని చెప్పింది. అలాగే గంగవ్వ అఖిల్ పేరు చెప్పగా మిగితా సభ్యులు రాజశేఖర్,నోయల్, సూర్య కిరణ్, లాస్య పేరు చెప్పారు.ఇక లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో భాగంగా టమోటా రసం పిండే టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌కి సంచాలకులుగా సూర్యకిరణ్ ఉండగా.. క్వాలిటీ మేనేజర్లుగా అరియానా, సొహైల్‌లు ఉంటారని ఇంటి సభ్యులు నాలుగు టీంలుగా(ముగ్గురుగా) విడిపోయి టమోటాలను సేకరించి జ్యూస్ తీసి డబ్బాల్లో పెట్టాలని ఎవరు ఎక్కువ డబ్బాల్లో డమోటా జ్యూస్ పడితే వాళ్లే విన్నర్ అని ప్రకటించారు బిగ్ బాస్ .

దీంతో టమోటాలు పట్టుకోవడంతో.. జ్యూస్ పిండటంలో ఒకరితో ఒకరు పోటీ పడి కింద మీద పడ్డారు. ఇందులో విజేతలెవరో నేటి ఎపిసోడ్‌లో తెలనుండగా హౌస్‌లో కట్టప్ప ఎవరో తెలుసుకునేందుకు స్టాంప్‌ వేసే పద్దతిని తెరపైకి తీసుకొచ్చారు బిగ్ బాస్. ఎవర్నైతే కట్టప్పగా భావిస్తున్నారో వారి మొఖంపై స్టాంప్ వేయాలని బిగ్ బాస్ కోరగా తన ముఖంపై తానే స్టాంప్ వేసుకుని జై మహిష్మతి అంటూ హల్ చల్ చేశారు నోయల్‌. మొత్తంగా కట్టప్ప ఎవరనేది నేటి ఎపిసోడ్‌లో తెలియనుంది.