నూతన రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శం..

250
anil

లండన్ : రాష్ట్రాన్ని ఉద్యమంలా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాల్లో ఇటీవల అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం ప్రత్యేకమైనదని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

నూతన రెవిన్యూ చట్టం ద్వారా పేద రైతులకి ఎంతో మేలు జరుగుతుందని, భూముల క్రయ విక్రయాల్లో పారదర్శకత ఉంటుందని, ఇది దేశానికే ఆదర్శమవుతుందని అనిల్ కూర్మాచలం తెలిపారు.

మరొక్కసారి ప్రజా నాయకుడిగా కెసిఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని యావత్ ఎన్నారై సమాజం హర్షిస్తుందని, ఇలాంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నందుకు కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.