రాణించిన రబాడ….ఆర్సీబీ జైత్రయాత్రకు బ్రేక్

213
kohli

ఐపీఎల్ 20లో ఆర్సీబీ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఢిల్లీ విధించిన 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్,బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించిన ఢిల్లీ 59 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగో విజయాన్ని నమోదుచేసింది.

భారీ లక్ష్యం,మంచి శుభారంభాన్ని అందించాల్సిన ఆర్సీబీ ఓపెనర్లు మరోసారి నిరాశ పర్చారు. పడిక్కల్ 4,ఫించ్ 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. తర్వాత వచ్చిన డివిలియర్స్ కూడా 9 పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో ఆర్సీబీ కష్టాల్లో కూరుకుపోయింది. చేయాల్సిన లక్ష్యం భారీగా ఉండటం,రన్ రేట్ పెరగడంతో ఒత్తిడికి లోనైన ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు.

తర్వాత విరాట్ 43,మొయిన్ అలీ 11,వాషింగ్టన్ సుందర్‌ 17,శివమ్ దుబే 11 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైపోయింది. ఆర్సీబీ బౌలర్లలో రబాడ 4,అక్షర్ పటేల్,నోర్టజే 2 వికెట్లు తీశారు.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మెన్‌ మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 196 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ స్టాయినీస్‌(53 నాటౌట్‌: 26 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), పృథ్వీ షా(42: 23బంతుల్లో 5ఫోర్లు,2సిక్సర్లు), రిషబ్‌ పంత్‌(37:25 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) , శిఖర్‌ ధావన్‌(32: 28 బంతుల్లో 3ఫోర్లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టగా ఉడానా, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ తీశారు. ఆర్సీబీ బౌలర్లలో 2,ఉదాన 1,మొయిన్ అలీ 1 వికెట్ తీశారు.