బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. . తెలుగులో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో త్వరలోనే మూడవ సీజన్ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 3కి నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21నుంచి బిగ్‌బాస్ 3 ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఈసారి బిగ్ బాస్ 3లో పార్టిసిపెంట్స్ ఎవరా అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.
మొదటి రెండు సీజన్లకు మించి ఈసారి సీజన్‌ను చేయాలనుకుంటున్న నిర్వాహకులు అందుకోసం పేరుమోసిన వారినే ఎంపిక చేశారట. వారిలో ప్రముఖంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో సీనియర్ నటి పేరు కూడా వినిపిస్తోంది. నటి హేమ బిగ్ బాస్ 3లో పాల్గోనబోతున్నట్లు తెలుస్తుంది.
హేమ ఈ షోకు మొదటి ఆకర్షణ అవుతుందని భావించిన నిర్వాహకులు అందుకు ఆమెను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, డ్యాన్సర్ రవికృష్ణ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ఉదయభాను, సింగర్ హేమచంద్ర, రఘు మాస్టర్ బిగ్‌బాస్ 3లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పార్టిసిపెంట్స్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మార్చి 21వరకు వేచి చూడాల్సిందే.