BB10:రెడ్ టీంకు బంపర్ ఆఫర్

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 10 విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా గొడవలు మరియు వినోదాత్మక స్కిట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

లైట్స్ ఆఫ్ అయిన తర్వాత కెప్టెన్ రూమ్‌లోని డ్రాగర్లను సభ్యులు బయటకు తీశారు. రోహిత్‌పై నమ్మకం పోవడంతో ఎవరి డ్రాగర్లు వాళ్లకు ఇచ్చేయాలని రాంప్రసాద్ ప్రతిపాదించాడు. మరోవైపు, రెడ్ టీమ్‌ను రెచ్చగొట్టడానికే తాను ప్లాన్ చేశానని, వర్షిణి తన పవర్ వాడితే తాను కూడా పవర్ ఉపయోగిస్తానని త్రిగుణ్ కెమెరా ముందే వెల్లడించాడు.

బిగ్‌బాస్ నిర్వహించిన ‘చిక్కుల లెక్కలు’ పజిల్ గేమ్‌లో రెండు టీమ్స్ నుంచి నలుగురేసి సభ్యులు పోటీపడ్డారు. రెడ్ టీమ్ తమకు వచ్చిన ప్రత్యేక అధికారంతో బ్లూ టీమ్ నుంచి షాలిని, దేబ్జానీ, ముకేశ్, నరేశ్‌లను ప్రత్యర్థులుగా ఎంచుకుంది. ఈ టాస్క్‌లో రెడ్ టీమ్ గెలవడంతో ఝాన్సీ, షాలిని దగ్గర ఉన్న డ్రాగర్‌ను లాక్కుంది. అనంతరం బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్‌ను కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి రెడ్ టీమ్ తప్పించింది.

టాస్క్ ఒత్తిడిని పక్కన పెట్టి నరేశ్, రాంప్రసాద్ కలిసి చేసిన డాక్టర్ ఎమర్జెన్సీ స్కిట్ నవ్వులు పూయించింది. అపూర్వ కెప్టెన్ అయితే ఇచ్చే చిత్రవిచిత్రమైన శిక్షలను, రోహిత్-దేబ్జానీల నామినేషన్ల విధానాన్ని అనుకరిస్తూ చేసిన హంగామా ఇంటి వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చింది.

పంచభూతాల యుద్ధంలో భాగంగా ‘సేల్ టూ డామినేట్’ అనే వాటర్ టాస్క్ ఇచ్చారు. రెడ్ టీమ్ నుంచి అపూర్వ, వర్షిణి; బ్లూ టీమ్ నుంచి దేబ్జానీ, సృష్టి పోటీపడ్డారు. ఆట మధ్యలో అపూర్వ కింద పడిపోవడంతో సంచాలక్ త్రిగుణ్ ఆమెను డిస్‌క్వాలిఫై చేశాడు. దీంతో అపూర్వ, రాంప్రసాద్, రోహిత్‌లు త్రిగుణ్‌తో తీవ్రంగా గొడవపడ్డారు. చివరకు రీస్టార్ట్ చేయగా దేబ్జానీ, సృష్టి గెలిచి, రెడ్ టీమ్ నుంచి రోహిత్, వర్షిణిల డ్రాగర్లను సొంతం చేసుకున్నారు.

రెండు టాస్క్‌ల్లో విజయం సాధించిన రెడ్ టీమ్ సభ్యులే కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికైనట్లు బిగ్‌బాస్ ప్రకటించడంతో ఎపిసోడ్ ముగిసింది.

Also Read:Age 18:సోషల్ మీడియా నిషేధం?

- Advertisement -