బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా 23 రోజులు పూర్తి చేసుకుంది.బిగ్ బాస్ హౌస్‌లో “అన్నయ్య రూల్స్ పెడతాడు కానీ పాటించడు” అనే వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు నటుడు త్రిగుణ్. ప్రతి వారం నామినేషన్ల ప్రక్రియలో ప్రధానంగా టార్గెట్ అయ్యే త్రిగుణ్, నాలుగో వారంలో కూడా నామినేషన్ల వేడికి కేంద్ర బిందువుగా నిలిచాడు. మంగళవారం నాటి 24వ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య తీవ్రమైన వాగ్వాదాలు, మాటల తూటాలు పేలాయి.
ఈ వారంలో బిగ్ బాస్ ప్రవేశపెట్టిన నామినేషన్ల ప్రాసెస్ గతంలో కంటే భిన్నంగా సాగింది. నామినేషన్స్ ప్రారంభానికి ముందు నిర్వహించిన రణరంగంలో ‘రథనిర్మాణం’ యుద్ధంలో ‘టీమ్ భైరవ’ విజయం సాధించింది. వరుస గేమ్‌లలో ప్రతిభ కనబరచడంతో భైరవ టీమ్‌కు బిగ్ బాస్ నుండి ప్రత్యేక అడ్వాంటేజ్‌లు లభించాయి. దీని ప్రకారం భైరవ టీమ్‌లోని ప్రతి సభ్యుడికి ఒకరిని నామినేట్ చేసే హక్కు దక్కింది. అదే సమయంలో ‘సప్తశక్తి’ టీమ్‌లోని సభ్యులందరికీ ఆ అవకాశం ఇవ్వలేదు. కేవలం ఇద్దరు మాత్రమే నామినేట్ చేయాలని, ఆ ఇద్దరినీ వారే పరస్పరం నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ షరతు విధించారు. నామినేట్ చేసే వ్యక్తి ముఖంపై నురుగ (స్ప్రే) కొట్టాలని సూచించారు. ఇక ముకేష్ ఇప్పటికే నేరుగా నామినేట్ అవ్వడం, అపూర్వ కెప్టెన్‌గా ఉండటంతో వీరిద్దరినీ నామినేట్ చేయకూడదని స్పష్టం చేశారు.
సప్తశక్తి టీమ్ నుంచి నామినేట్ చేసే అవకాశం కోసం త్రిగుణ్ పట్టుబట్టి మరీ ముందుకొచ్చాడు. దాంతో త్రిగుణ్, నరేష్‌లకు ఆ అవకాశం లభించింది. త్రిగుణ్ మొదటగా రోహిత్‌ను నామినేట్ చేస్తూ పర్సనల్ ఎటాక్ చేశాడు. గతంలో మాట్లాడే సమయంలో నోటి తుంపర్లు పడటాన్ని పెద్ద సీన్ చేశాడని, రోహిత్‌కు యాక్టింగ్ రాదని ఎద్దేవా చేశాడు. దీనికి రోహిత్ బదులిస్తూ, త్రిగుణ్ తనపై తప్పుడు నెరేటివ్ సెట్ చేస్తున్నాడని, క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డాడు.
ఆ తర్వాత నరేష్.. అమన్‌ను నామినేట్ చేశాడు. అమన్ ప్రతి గొడవలోనూ ట్రిగర్ అవుతున్నాడని, సంచాలక్‌గా కూడా సరిగా చేయలేదని కారణాలు చెప్పాడు. అయితే ఇది ప్లాన్ ప్రకారం జరుగుతున్న నామినేషన్ లా ఉందంటూ అమన్ కౌంటర్ ఇచ్చాడు. అనంతరం త్రిగుణ్‌ను అమన్ నామినేట్ చేస్తూ.. ఆయన వేరొకరి చేతిలో పప్పెట్‌లా మారారని విమర్శించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, త్రిగుణ్ చివరకు చేతులు జోడించి అమన్‌కు సారీ చెప్పాల్సి వచ్చింది.
కెప్టెన్ అపూర్వ కూడా త్రిగుణ్‌ను దారుణంగా కడిగిపారేసింది. “త్రిగుణ్ అంటే దూత కాదు, మాకు పెద్ద మోత” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఆడపిల్లల పట్ల, తోటి కంటెస్టెంట్ల పట్ల ఆయన ప్రవర్తించే తీరు అసహ్యకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. “లేడీ త్రిగుణ్” అని తనకు ఇచ్చిన బిరుదు చాలా చిరాగ్గా ఉందని, ఆయన నక్క, పాము లాంటి వ్యూహాలతో ఆడుతున్నాడని ఇచ్చిపడేసింది.
మిగిలిన నామినేషన్లలో రాం ప్రసాద్ – షాలినిని, రోహిత్ – దేబ్జానీని, వర్షిణి – సృష్టిని, వంశీ – చరణ్‌ను, సుధీర్ – చరణ్‌ను నామినేట్ చేశారు.
మొత్తంగా ఈ నాలుగో వారంలో నామినేట్ అయిన 9 మంది కంటెస్టెంట్లు:
ముకేష్ గౌడ (డైరెక్ట్ నామినేషన్)
త్రిగుణ్
దేబ్జానీ
రోహిత్
షాలిని
అమన్
చరణ్
నరేష్
సృష్టి
Also Read:‘గోల్డెన్ భాగ్యం’..ఫుల్ ఫన్ టైటిల్
ప్రస్తుతం ఉన్న ఓటింగ్ సరళి ఆధారంగా చరణ్, సృష్టిలు అత్యంత ప్రమాదకరమైన (డేంజర్) జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

