‘గోల్డెన్ భాగ్యం’..ఫుల్ ఫన్‌ టైటిల్

1
- Advertisement -

కామెడీ పవర్‌హౌస్‌లు సత్య, యోగిబాబు కలిసి ఓ కొత్త కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబో తున్నారు. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు బ్యానర్లపై నాగార్జున రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లకు ఇదే తొలి ప్రొడక్షన్ వెంచర్. తాజాగా చిత్ర బృందం టైటిల్ రివీల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు.

ఇది తెలుగు, తమిళ భాషలను కలిపి, రెండు ఇండస్ట్రీలకు చెందిన పాపులర్ యాక్టర్స్‌తో తెరకెక్కుతున్న ‘తెలుమిల్’ ప్రాజెక్ట్. గ్లింప్స్ ప్రారంభంలో ఓ తెలుగు వ్యక్తి, ఓ తమిళ వ్యక్తి తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. తమ వంటకాలే బెస్ట్ అంటూ గొప్పగా చెప్పుకోవడం నవ్వులు పూయిస్తుంది. తెలుగు వ్యక్తి బిర్యానీతో పాటు కూల్ డ్రింక్‌ను ఆస్వాదిస్తుండగా.. తమిళ వ్యక్తి ఇడ్లీ, సాంబార్ తింటూ కనిపిస్తాడు. వీరిద్దరి మధ్య సరదా వాదన జరుగుతుండగా.. మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చి, ఇంతకంటే పెద్ద కాంబినేషన్ ముందుందని చెప్పడంతో సీన్ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

ఆ తర్వాత సత్య, యోగిబాబులను స్టైలిష్‌గా పరిచయం చేశారు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపించారు. వీరి కథలో ప్రేమతో పాటు క్రైమ్, యాక్షన్ అంశాలు కూడా మిళితమై ఉంటాయని దర్శకుడు ఆసక్తికరంగా వెల్లడించారు. చివర్లో సినిమా టైటిల్‌ను ‘గోల్డెన్ భాగ్యం’గా రివీల్ చేశారు.

తెలుగు, తమిళ సినిమాల్లో పాపులర్ అయిన ఇద్దరు కామెడీ స్టార్స్ సత్య, యోగిబాబులను కలిపి ఓ బైలింగ్వల్ క్రాస్‌ఓవర్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తూ దర్శకుడు పవన్ బాసంశెట్టి డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. తెలుగు నటుడు సత్య తమిళంలో మాట్లాడటం, తమిళ స్టార్ యోగిబాబు తెలుగులో మాట్లాడటం గ్లింప్స్‌లో మరింత ఫన్‌ను క్రియేట్ చేశాయి. వీరిద్దరినీ భారీ తెలుగు-తమిళ కాంబినేషన్‌గా ప్రజెంట్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ మల్టీస్టారర్ కటౌట్స్‌ను కూడా చూపించారు. గ్లింప్స్ చూస్తే.. లీడ్ యాక్టర్స్ మధ్య ఉండే యూనిక్ కెమిస్ట్రీ చుట్టూ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు అర్ధమౌతోంది.

సత్య, యోగిబాబు తొలిసారి ఈ తరహా సెటప్‌లో కలిసి నటిస్తుండటంతో.. వీరిద్దరి కామెడీ స్టైల్, టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జయశ్రీ, అధిరాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుధర్శన్, కిశోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రతిభావంతమైన టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. మలయాళ సినిమా రంగానికి చెందిన సినిమాటోగ్రాఫర్ బబ్లూ అజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం సమకూరుస్తున్నారు. కామేష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్‌

ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌లో కూడా మేకర్స్ కామెడీ మార్క్‌ను చూపించారు. తొలుత సినిమాను సంక్రాంతి రిలీజ్‌గా ప్రకటించిన మేకర్స్.. ఆ తర్వాత సంక్రాంతి నుంచి సినిమాను వాయిదా వేసి, చివరికి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. సినిమా కాన్సెప్ట్‌లోని ఫన్‌కు తగ్గట్టుగానే ఈ రిలీజ్ అనౌన్స్‌మెంట్ కూడా సరదాగా సాగింది.

తారాగణం: సత్య, యోగి బాబు, జయశ్రీ, అతిరాజ్, వెన్నెల కిషోర్, సుదర్శన్, కిషోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాతలు: నాగార్జున రెడ్డి & పవన్ బసంశెట్టి
బ్యానర్లు: డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు
సంగీతం: పవన్ సిహెచ్
DOP: బబ్లూ అజు
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: కామేష్
PRO: వంశీ-శేఖర్

- Advertisement -