బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం తీవ్ర ఉత్కంఠ, అనూహ్య మలుపులతో కొనసాగుతోంది. డే 18 ఎపిసోడ్ 19లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు, టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ డ్రామాతో పాటు ‘అగ్ని పరీక్ష’ సభ్యులు అపూర్వ, మిథిలేష్, రామకృష్ణల సర్ ప్రైజ్ ఎంట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో బజర్ నొక్కిన నరేష్, వంశీల వివాదంలో సంచాలకుడిగా ఉన్న త్రిగుణ్ తొలుత నరేష్ అని చెప్పి, ఆ తర్వాత వంశీ వైపు మొగ్గు చూపాడు. తప్పు ఉంటే తనపైనే శిక్ష పడుతుందని త్రిగుణ్ పేర్కొన్నాడు. ఆ తదుపరి టాస్క్‌లో వంశీపై ఝాన్సీ విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్‌గా మారడమే కాకుండా ఫ్యామిలీ ఫోటోను గెలుచుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఆప్షన్లతో నరేష్ కుటుంబ లేఖను ముక్కలు చేయాల్సి వచ్చింది. అనంతరం గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ అందించిన విందును సభ్యులంతా ఆస్వాదించారు.
విందు పూర్తయ్యాక లివింగ్ ఏరియాలోని స్క్రీన్ మీద కంటెస్టెంట్ల గురించి తీవ్రమైన వ్యాఖ్యలు ప్రత్యక్షమయ్యాయి. ఝాన్సీ సింపతీ, రైతు బిడ్డ ట్యాగ్ కోసం ఆరాటపడుతోందని; ముఖేష్ వర్షిణి వల్ల గేమ్ డీవియేట్ అవుతున్నాడని; షాలినీ ‘ట్రిగ్గరింగ్ క్వీన్’, ‘బ్యాక్ బిచింగ్ స్టార్’ అని కామెంట్లు వచ్చాయి. రాం ప్రసాద్, నరేష్, త్రిగుణ్, వర్షిణి, సుధీర్ లాంటి ఆటగాళ్లపై కూడా కన్నింగ్, మానిప్యులేటివ్, పప్పెట్ అని తీవ్ర అభియోగాలు మోపారు. ఇవి ఆడియెన్స్ రియాక్షన్ అనుకుని కంటెస్టెంట్లు కాస్త నిరాశ చెందారు.
అయితే ఈ కామెంట్లు రాసింది ఆడియెన్స్ కాదని, ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టడానికి సిద్ధమైన అపూర్వ, మిథిలేష్, రామకృష్ణ అని బిగ్ బాస్ స్పష్టం చేశాడు. గేట్ దాటి లోపలికి రావడానికి ప్రస్తుత కంటెస్టెంట్ల మెజార్టీ ఓట్లు తప్పనిసరి అని ప్రకటించారు.
ఈ క్రమంలో ఇంట్లోకి రావాలనుకుంటున్న ముగ్గురితో కంటెస్టెంట్లకు తీవ్ర వాగ్వాదం జరిగింది.మిథిలేష్ వర్సెస్ రాం ప్రసాద్ & త్రిగుణ్: రాం ప్రసాద్‌ను కన్నింగ్ అని, త్రిగుణ్‌ను మానిప్యులేటర్ అని మిథిలేష్ నేరుగా విమర్శించాడు. రోహిత్‌ను ‘స్టెరాయిడ్స్’ అని అనడంపై మిథిలేష్ ప్రశ్నించగా, త్రిగుణ్ అది తెలుగు సామెత అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. పద్యాలు చెప్పాలంటూ టాపిక్ డైవర్ట్ చేయాలని చూసిన త్రిగుణ్‌కి “పద్యాలు చెప్పడానికి ఇక్కడకు రాలేదు” అని మిథిలేష్ ఇచ్చిపడేసాడు.
Also Read:పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక!
అపూర్వ వర్సెస్ ముఖేష్: ముఖేష్ తమను స్టార్ ప్లేయర్ అని చెప్పుకోవడానికి ప్రయత్నించగా, అపూర్వ “మీకు నలుగురే ఓట్లు వేశారు, అది కూడా మీ కూటమి మెంబర్లే” అని ఘాటు కౌంటర్ ఇచ్చింది. మాట్లాడేటప్పుడు ముఖేష్ నోరు మూసుకోమని సైగలు చేయడంతో అపూర్వ తీవ్రంగా మండిపడింది.
అనంతరం బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఈ ముగ్గురిలో ఎవరిని ఇంట్లోకి పంపాలో నిర్ణయించడానికి కంటెస్టెంట్లు సీక్రెట్ ఓటింగ్ వేశారు. మిథిలేష్ జిమ్ ట్రైనర్‌గా బయటే ఉండాలని ముఖేష్ వ్యాఖ్యానించగా, రామకృష్ణ జెన్యూన్‌గా ఉన్నాడని ముఖేష్, సుధీర్, వర్షిణి అభిప్రాయపడ్డారు. చివరికి బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు ప్రవేశిస్తారనేది తర్వాతి ఎపిసోడ్‌లో తేలనుంది.

