బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. హిందీలో 11సీజన్ లు పూర్తి చేసుకున్న ఈషో తెలుగులో 2సీజన్ లను పూర్తి చేసుకుంది. తొలి సీజన్ లో యంగ్ టైగన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్ కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. త్వరలోనే సీజన్ 3 కూడా ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. గత రెండు సీజన్ లు మంచి రేటింగ్ లో నడవగా మూడో సీజన్ కూడా అదే రేంజ్ లో జరపాలని చూస్తున్నారు. ప్రస్తుతం సెలబ్రెటీలను వెతికే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొంత మంది సెలబ్రెటీలు ఓకే చెప్పేసిన మరికొంత మంది కోసం వెతుకుతున్నారు. ఇక మూడో సీజన్ కు హోస్ట్ గా ఎవరిని ఉంచాలన్నా దానిపై చర్చలు నడుస్తున్నాయి.
తొలి సీజన్‌ని ఎన్టీఆర్ అన్నీ తానై నడిపించి మంచి సక్సెస్ చేయడంతో మూడో సీజన్‌కి కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాలని నిర్వాహకులు భావించారట. కాని ప్రస్తుతం ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్‌తో బాగా బీజీగా ఉండటంతో డేట్స్ లేవని చెప్పేశాడట. పోని నానిని తీసుకుందామని అనుకున్నా.. సెకండ్ సీజన్ లో ఆయనపై కొంచెం వ్యవతిరేకత రావడంతో మళ్లీ ఆయనను సంప్రదించలేదట. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు తాజాగా మరో సీనియర్ హీరోను సంప్రదించారని తెలుస్తుంది.
అక్కినేని హీరో నాగార్జునను బిగ్ బాస్ 3కి హోస్ట్ గా తీసుకోవాలని చూస్తున్నారట. పైగా నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు కి హోస్ట్ చేసిన అనుభవం ఉండటంతో ఆయనపై బిగ్ బాస్ నిర్వాహకులు గట్టి నమ్మకం ఉంచినట్టు సమాచారం. మరోవైపు నాగ్ త్వరలో మన్మథుడు 2 చిత్రంతో పాటు సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ చేయనున్నాడు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ 3 షో నిర్వహించగా..అందుకు తగిన సెట్టింగ్ ను కూడా రెడీ చేసేశారు. ఫైనల్ గా బిగ్ బాస్ 3కి హోస్ట్ గా ఎవరిని తీసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.