బిగ్ బాస్ 3 పార్టీసిపెంట్స్ కు వార్నింగ్ ఇచ్చిన కౌశల్

465
Koushal Manda
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 ప్రారంభమైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 1, 2 సీజన్లు ఎటువంటి గొడవలు లేకుండా పూర్తయ్యాయి…. కానీ బిగ్ బాస్ 3 ప్రారంభం నుంచే వివాదాలు ఎదుర్కొంది. తాజాగా బిగ్ బాస్ 3 వివాదంపై స్పందించారు బిగ్ బాస్2 టైటిల్ విన్నర్ కౌశల్ మంద.

బిగ్‌బాస్ 3లో తన పేరును వాడుకోవద్దని హెచ్చరించాడు. బిగ్‌బాస్‌ 3లో పబ్లిసిటీ కోసం కానీ ఇంటర్వ్యూల కోసం కానీ కౌశల్‌ ఆర్మీ పేరును వాడుకోవద్దు అని తన ఇస్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. గత సీజన్ మధ్యలో నుంచి కౌశల్ కు మద్దతుగా ఫ్యాన్స్ కౌశల్ ఆర్మీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కౌశల్ టైటిల్ గెలవడానికి కారణం కూడా ఆర్మీ అని చెప్పుకోవచ్చు.. ఇప్పుడు సీజన్ 3లో కూడా ఆర్మీలు రచ్చ చేస్తున్నాయి. యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే శ్రీముఖి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అందుకోసమే తన పేరును సీజన్ 3లో వాడొద్దని చెప్పాడట కౌశల్. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్న ఈషోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

- Advertisement -