డ్రగ్స్ కేసులో బిగ్‌బాస్‌ ట్విస్ట్ !

205
NTR bigboss
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ తెలుగు షో ఆదివారం గ్రాండ్‌‌‌గా ప్రారంభం అయింది. మొత్తం 14 మంది పోటీ దారులను పరిచయం చేసిన అనంతరం ఎన్టీఆర్ ఈ షోలో అతి ముఖ్యమైన ఘట్టానికి తెరతీశారు. వీరంతా 70 రోజుల పాటుఈ సెట్‌లో గడపనున్నారు. ఈ సెట్‌లో మొత్తం 60 కెమెరాలు ఉండగా.. సెట్‌లో అద్బుతమైన స్విమ్మింగ్‌ఫూల్, విశాలమైన హాలు ఏర్పాటు చేశారు. ఈ 70 రోజులు వీరు ఏమేమి చేస్తున్నారన్నదీ కెమెరాలో రికార్డవుతుంటుంది. పార్టిసిపెంట్స్ కు ఈ 70 రోజులు బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. షో నిబంధనల ప్రకారం ఇంట్లోని వారితో ఫోన్‌లో సంభాషించేందుకు అవకాశం ఉండదు.

telugu big boss show

అయితే ఈ ‘బిగ్ బాస్’ షోలో టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ దందాలో ఇరుక్కున్న వారుండటంతో కొత్త ట్విస్ట్ వచ్చి పడింది.. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే ముమైత్ ఖాన్ కు నోటీసులు పంపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ముమైత్ ఖాన్ 21వ తేదీన పోలీసుల విచారణకు హాజరు కావాల్సి వుంది. ముమైత్‌తో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైనా వారిలో మరో ఇద్దరికి కూడా డ్రగ్స్‌ కేసులో ప్రమేయం ఉందని సమాచారం.. వారికి సెకండ్ లిస్టులో నోటీసులు పంపాల్సి వుందని సిట్ వర్గాల సమాచారం.

telugu big boss show

కాగా, నోటీసులు అందుకున్న వారు తాము చెప్పిన సమయానికి విచారణకు హాజరు కావాల్సిందేనని, తప్పనిసరైతే, తాము కల్పించుకుని వారిని హౌస్ నుంచి బయటకు తెచ్చి విచారిస్తామని సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కున్న తారలను తమ షోలో ఉంచాలో లేక ఎలిమినేట్ చేయాలో తెలియని అయోమయ స్థితిలో స్టార్ మా వారు ఉన్నట్లుగా తెలిసింది. బిగ్ బాస్ షోలో పాల్గోంటున్న వారంతా బాహ్య ప్రపంచంతో 70 రోజుల పాటు సంబంధాలు లేకుండా హోస్ లోనే ఉండిపోవాల్సి వుండటంతో, వీరిని విచారించేందుకు మార్గమేంటన్నది అకున్ సభర్వాల్ ముందున్న ప్రశ్న.

- Advertisement -