TCS నాసిక్ కేసులో షాకింగ్ ట్విస్ట్!

12
- Advertisement -

కార్పొరేట్ రంగంలో లైంగిక వేధింపుల ఉదంతంగా మొదలైన ‘TCS నాసిక్’ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వెల్లడించిన నిజాలు జాతీయ భద్రతనే ప్రశ్నిస్తున్నాయి.

TCS నాసిక్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ధైర్యంగా ముందుకు వచ్చి తమపై జరుగుతున్న క్రమబద్ధమైన లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ మరియు బలవంతపు మత మార్పిడి యత్నాలను బయటపెట్టారు. ఈ ఆపరేషన్ వెనుక ఒక లోతైన సిండికేట్ ఉందని ఆరోపించిన పోలీసులు, ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా భావిస్తున్న హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. నిందితులకు సహకరించడం మరియు ఈ చీకటి నెట్‌వర్క్‌ను నడపడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. తాజా సమాచారం ప్రకారం, నిదా ఖాన్‌కు జైషే మహ్మద్ మహిళా విభాగానికి చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. 2025లో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో షాహీన్ కీలక నిందితురాలు కావడం గమనార్హం.

Also Read:దక్షిణాదికి అన్యాయం జరగకూడదు:గుత్తా

ఒక పేరుమోసిన సాఫ్ట్‌వేర్ సంస్థలోని ఉన్నత స్థాయి ఉద్యోగికి ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉండటం కార్పొరేట్ సంస్థల బ్యాక్‌గ్రౌండ్ చెక్ వ్యవస్థలను విస్మయానికి గురిచేస్తోంది. నిదా ఖాన్‌ను పట్టుకుంటేనే ఈ నెట్‌వర్క్ మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో తెలుస్తుంది.

కార్పొరేట్ కార్యాలయాల్లో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు, ఇలాంటి శక్తులు వ్యవస్థల్లోకి చొరబడకుండా మెరుగైన భద్రతా ప్రమాణాలు పాటించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.

- Advertisement -