రియాల్టీ తో బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది బిగ్ బాస్ షో. తెలుగు, తమిళ, హిందీ ఇలా పలు భాషల్లో బిగ్ బాస్ షో ను నిర్వహిస్తోన్నారు నిర్వాహకులు. పలు భాషల్లో మొదటి సిజన్ ప్రశాంతంగా ముగిసిన తమిళ్ లో మాత్రం కొంచెం ఒడిదొడుకులు ఎదుర్కొంది. కొద్ది రోజుల క్రీతమే సెకండ్ సీజన్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. తమిళ్ లో బిగ్ బాస్ షో కు వ్యాఖ్యాతగా విలక్షణ నటుడు కమల్ హాసన్ చేస్తోన్నారు. అయితే తమిళ్ బిగ్ బాస్ షోకు కొత్త సమస్యలు వచ్చాయి.
తమిళ్ బిగ్ బాస్ 2 ను ఆపేయాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా వారు బిగ్ బాస్ నిర్వాహకులకు తెలిపారు. త్వరలోనే ఈషోను అడ్డుకుంటామని హెచ్చరించారు. అందుకు తగిని కారణాలను కూడా వారు వివరించారు. ఈషోలో పనిచేస్తోన్న టెక్నిషియన్లలో దాదాపు 75 నుంచి 85శాతం వరకూ ముంబాయి వారే ఉన్నారట. దింతో తమిళ్ టెక్నిషియన్లకు అన్యాయం జరుగుతోందని వారు డిమాండ్ చేశారు.
గత సీజన్ లో కూడా ఇలానే జరిగితే వ్యాఖ్యత కమల్ హాసన్ తో మాట్లాడి 50శాతం మందిని వెనక్కి పంపించేశారు. ఈసందర్భంగా సీజన్ 2లో కూడా మళ్లి పాత పద్దతినే పాటిస్తోన్నారని తెలియడంతో ఆగ్రహానికి గురయ్యారు సంఘం సభ్యులు. బిగ్ బాస్ నిబంధనలకు విరుద్దంగా ఈషోను నిర్వహిస్తోన్నారని హెచ్చరించారు. రేపటి నుంచి తమిళ సంఘం టెక్నిషియన్లను తీసుకోకపోతే బిగ్ బాస్ షూటింగ్ ఆపేస్తామని హెచ్చరించారు. గతంలో కూడా ఇలా గొడవ కావడంతో షోకు ఆటంకం ఏర్పడింది. మరి తమిళుల డిమాండ్ పై బిగ్ బాస్ నిర్వాహకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.