- Advertisement -
దేశ వ్యాప్తంగా ఉదయం 8గంటలకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట అర్ధగంట సేపు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీకి షాక్ తగిలింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత చూపించినట్లుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాగంగా ఏపీలో టీడీపీ అభ్యర్దులతో పోలిస్తే వైసిపి అభ్యర్దులకు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది.
శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరి కాసేట్లో ఈవీఎంలను లెక్కించనున్నారు.
- Advertisement -