కోమటిరెడ్డి బ్రదర్స్‌కు గట్టి షాక్ తగిలింది.మితిమీరిన ఆత్మవిశ్వాసం లోపించిన వ్యూహం వెరసీ లోకల్ బాడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్ధానాన్ని కొల్పోయింది. గెలిచే అవకాశం ఉన్న సిట్టింగ్ స్ధానాన్ని చేజేతులా పోగొట్టుకుని శాసనమండలిలో ఒకే ఒక ఎమ్మెల్సీకి పరిమితమైంది.
ఇక ప్రస్తుతం జరిగిన వరంగల్,నల్గొండ,రంగారెడ్డి స్ధానాల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. నల్గొండ,రంగారెడ్డిలో ఓ మోస్తారు ఓట్లు సాధించినా వరంగల్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
2015లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. రాజగోపాల్‌రెడ్డి 150 ఓట్ల మెజార్టీతో తేరా చిన్నపురెడ్డిపై గెలుపొందారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్సై తేరా చిన్నపురెడ్డి దాదాపు 200కి పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
గతంలో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వారిని, సానుభూతిపరులను ఆకట్టుకునే విషయంలో కూడా స్థాని క, రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందనే చర్చ ఆ పార్టీలోనే సాగుతోంది. అప్పుడు ఓటేసిన వారంతా ఇంకా తమవైపే ఉన్నారని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ చతికిలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.