కాంగ్రెస్‌కు మరో షాక్..బీజేపీలోకి కీలక నేతలు!

12
- Advertisement -

హర్యానా కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ సీఎం భన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరి, మనవరాలు శృతి కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. హర్యానా మాజీ సీఎం బన్సిలాల్ చౌదరి కుమారుడు సురేంద్ర సింగ్ భార్యే ఈ కిరణ్ చౌదరి. భర్త మృతి చెందడంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు.

ఇక కిరణ్ చౌదరి కూతురు శృతి చౌదరి కూడా హర్యానా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో భివానీ-మహేంద్రగఢ్ నుంచి ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం హర్యానా కాంగ్రెస్ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ లో శృతి ఒకరు.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న టైంలో కీలక నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:Harish:రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

- Advertisement -