‘మా ఇష్టం’.. వర్మకు మరో షాక్‌..!

130
Ram Gopal Varma
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిర్మాత నట్టి కుమార్ మరో షాక్‌ ఇచ్చారు. వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘మా ఇష్టం’ చిత్రానికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, వర్మ తనకు డబ్బులు ఇవ్వాలని, అందువల్ల విడుదలను ఆపేయాలని కోర్టు నుంచి నట్టి కుమార్ స్టే తెచ్చిన విషయం తెలిసిందే. అయితే వర్మ మాట్లాడుతూ మా సినిమా ఆగింది ఈ కారణం వలన కాదని, నట్టికుమార్ వ్యాఖ్యలను, ఆరోపణలను పట్టించుకొనే సమయం లేదని తేల్చి చెప్పి మే 6న తమ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించాడు.

అయితే, శుక్రవారం ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్మకు నట్టి కుమార్ మరోసారి షాకిచ్చారు. ఈ సినిమా విడుదల చేయకూడదంటూ కోర్టు నుంచి మరో స్టే తీసుకొచ్చారు. ఈ సారి వర్మకు కోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతికి మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని.. అంతవరకు థియేటర్లో కానీ, ఓటీటీలో కానీ సినిమాను విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

- Advertisement -