మహాకూటమిలో భాగస్వామి అయిన తెలంగాణ జన సమితి12 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత విశ్వేశ్వరరావు స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన నేడు పార్టీ ఆఫిసులో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ అభ్యర్దులను కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కూటమిలో సీట్ల సర్దుబాటుపై గత కొద్దిరోజులుగా తీవ్రస్థాయి చర్చలు నడుస్తున్నాయన్నారు. తాము పోటీ చేసే స్ధానాలు దుబ్బాక, మెదక్, మల్కాజ్‌గిరి, అంబర్‌పేట్, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్థన్నపేట, ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
తాము పోటీ చేసే స్ధానాల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తమ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన సీట్లను కూడా టీజేఎస్ ప్రకటించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
స్టేషన్ ఘన్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఇందిరా ను ప్రకటించగా టీజేఎస్ కూడా అక్కడి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే అసీఫాబాద్ నుంచి కాంగ్రెస్ ఆత్రం సక్కును ప్రకటించగా అక్కడి నుంచే టీజేఎస్ అభ్యర్దులు బరిలో ఉంటారని తెలిపారు. ముందునుంచి ఉహించినట్టుగానే జనగామ సీటును టీజేఎస్ ప్రకటించింది. దింతో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాలకు మొండిచేయి చూపినట్టే అని తెలుస్తుంది.