- Advertisement -
స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్‌ను కలిశారు మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు, గద్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్.
కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కేశవ్‌తో పాటు 10 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు.
వచ్చేనెల 6న లేదా 10న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. గద్వాల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు వందలాది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు.
Also Read:విధులకు ఆలస్యం..తుమ్మల ఆగ్రహం
- Advertisement -

