తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో త్వరలో పీసీసీ ప్రక్షాళన ఉండనుందని గాంధీ భవన్ లో జోరుగా చర్చ నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటించననున్నారని తెలుస్తుంది. ఇక పీసీసీ ఛీప్ పదవి కోసం కాంగ్రెస్ దాదాపు డజనుకు పైగా మంది ఎదురుచూస్తున్నారు. త్వరలోనే టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయనున్నారని తెలుస్తుంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరును అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుంది.
ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇటివలే గాంధీ భవన్ లో శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యలో జరిగిన సంభాషణ చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఇకపై బీ ఫామ్ లు ఇచ్చేది నువ్వే కదా అని శ్రీధర్ బాబును ఉద్దేశించి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనగా…పై నుంచి బీ ఫామ్ లు పంపించేది నువ్వే కదా అని శ్రీథర్ బాబు అన్నారు.
కాగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. పిసిసి అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్లు ఎదురుచూస్తుండగా శ్రీధర్ బాబు పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. పార్లమెంట్ ఫలితాల తర్వాత కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఎవరూ ఉంటారో చూడాలి మరి.