జూలై 21 నుంచి బిగ్ బాస్‌ 3

477
big boss 3
- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ 3’ అప్డేట్ వచ్చేసింది. జూలై 21 నుంచి బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుంది. సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా,రెండో సీజన్‌ని నాని హోస్ట్ చేశారు. ఇక మూడో సీజన్‌కి మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కింగ్ నాగార్జునే హోస్ట్‌ గా వ్యవహరించనున్నారు.

బిగ్ బాస్ సీజన్‌ 3లో పలు మార్పులు చేశారు.గతేడాది కామన్ మ్యాన్ గా ఒకరిని హౌస్ లో తీసుకునే వారు. కానీ, ఇప్పుడు కామన్ మ్యాన్ లేరు. అందరు సెలెబ్రిటీలే. హౌస్ లో పాల్గొనే సెలెబ్రిటీలు ఎవరు అన్నది త్వరలోనే తేలిపోతుంది. జులై 21న ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

16 మంది సభ్యులు సెలెబ్రిటీలే ఉంటారట. నాగార్జున లాంటి సీనియర్ హీరో హోస్ట్ గా వ్యవహరించబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత బిగ్ బాస్ సీజన్ లో చోటుచేసుకున్న వివాదాలు ఈ సీజన్ లో రీపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

బిగ్ బాస్ బాలీవుడ్ లో సూపర్ ఫేమసైనా రియాలిటీ షో. గత 12 సంవత్సరాలుగా ఈ షోను నిర్వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -