మొక్కలు నాటడం ఆనందంగా ఉంది: నేహా చౌదరి

126
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. రోజురోజు ప్రముఖులు పాల్గొన్ని మొక్కలు నాటి వాటి అవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లో మూడు మొక్కలు నాటిన బిగ్‌బాస్‌-6 కంటెస్టెడ్ నేహా చౌదరి.

ఈ సందర్భంగా నేహా చౌదరి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మూడు మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే నేను ఇంతటి గొప్ప కార్యక్రమం లో పాల్గొనడం మనసుకు చాలా ఉత్సహాన్ని ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటే అవసరం ఎంతయినా ఉంది అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ధన్యవాదములు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక యజ్ఞంల తీసుకెళ్తూ ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -