హైకోర్టులో బిగ్‌బాస్ … ఏం జరగబోతోంది?

548
big boss 3
- Advertisement -

బిగ్‌ బాస్ సీజన్‌ 3 ప్రారంభానికి మరో ఐదు రోజులు మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికి కంటెస్టెంట్‌లు ఎవరో అని తెలియక పోయినప్పటికీ ప్రొమోలతో అంచనాలను పెంచేసింది బిగ్ బాస్ యూనిట్‌. అయితే బిగ్ బాస్ షోని ఆపేయాలని నటి గాయత్రి గుప్తా,జర్నలిస్ట్ శ్వేతారెడ్డి కాస్టింగ్ కౌచ్‌ కింద బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో అడుగు ముందుకెస్తూ హైకోర్టును ఆశ్రయించారు. బిగ్ బాస్‌ను ఆపేయాలని పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. మరోవైపు బిగ్ బాస్ కో ఆర్డినేషన్‌ టీమ్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో బిగ్‌బాస్ పై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు షో నిర్వాహకులు.

ఇక షో నిర్వాహకులకు షాక్ తగిలేలా బిగ్‌బాస్‌కు సంబంధించి ప్రతి ఎపిసోడ్‌నూ సెన్సార్ చేయాలని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాత్రి 11 గంటల తర్వాతే షోను ప్రసారం చేయాలని ఆ పిటిషన్‌లో కేతిరెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా జూలై 21 నుంచి ఈ షో ప్రారంభంకానుండగా హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -