బిగ్ బాస్ 3 తెలుగు విజయవంతంగా 88 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని గురువారంతో 89వ ఎపిసోడ్‌కి చేరుకుంది. ఇక ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్.
బిగ్ హౌస్‌కి కొత్త అతిథిగా వచ్చిన వరుణ్ నానమ్మ రాజ్యలక్ష్మి తన మాటలతో ఇంటి సభ్యుల్నే కాకుండా ప్రేక్షకుల్ని కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. వితికా రాణి పడుకున్నావా? అంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన బామ్మ నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంది. నా మనవడు ఎంతో మీరూ నాకు అంతే అంటూ అందరిలో జోష్ నింపింది.బిగ్ బాస్ మీరు ఎలా ఉంటారు? మీ ఫొటో ఒకటి పంపుతారా? మీరు మా ఇంటికి వస్తారా? అంటూ నవ్వులు పూయించింది.
తర్వాత రాహుల్ తల్లి సుధారాణి వచ్చారు. సీక్రెట్ రూం నుండి రాహుల్…. రాహుల్ అనిపిలవగానే పరుగున వెళ్లి తల్లి ఒడిలో ఒదిగిపోయాడు రాహుల్. ఇంకో రెండు వారాలు మాత్రమే ఉంది…ఇంట్రెస్ట్ పెట్టి ఆడూ అంటూ జాగ్రత్తలు చెప్పింది సుధారాణి. నా కొడుకు మనసులో ఒకటి పెట్టుకుని పైగా ఒకటి మాట్లాడలేడు. ముఖం మీద అనేస్తాడు కాని వాడి మనసు చాలా మంచిది అంటూ చెప్పుకొచ్చారు.
తర్వాత శ్రీముఖి తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆమె బోరు బోరున ఏడ్చింది. నువ్ ఆల్రెడీ టైటిల్ గెలిచేశావ్.. బయట నీ రేంజ్ వేరు.. నిన్ను చూస్తే నాకు చాలా గర్వం ఉందని శ్రీముఖి తల్లి లత చెప్పారు. ఇంటి సభ్యులతో మాట్లాడుతూ రాహుల్‌పై సెటైర్ వేశారు లత. మీరిద్దరూ మాట్లాడుకోండి.. పోట్లాడుకోకండి. వాళ్లకు బయట పేరెంట్స్ ఉంటారు. వాళ్లు బాధ పడతారు అని ఆలోచించు …ఒక తల్లిగా నువ్ ఆమెను అంటున్న మాటలకు నాకు బాధగా ఉంది అంటూ చురకలంటించారు. మొత్తంగా 89వ ఎపిసోడ్‌తో బిగ్ బాస్ హౌస్ 7 స్టార్ హోటల్‌గా మారింది. ఇంటి సభ్యులందరూ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో నెక్ట్స్ ఎపిసోడ్‌లో లగ్జరీ బడ్జెట్ అందించనున్నారు బిగ్ బాస్.
ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి అంతా నామినేట్ కాగా ముందువరుసలో వితికా,శివజ్యోతి ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరందకుంది.