బిగ్‌ బాస్‌ 3…ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌..!

404
vithika

బిగ్ బాస్ 3 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. 13వ వారంలో హౌస్‌లో ఉన్న ఏడుగురిని నామినేషన్‌ ప్రక్రియలోకి నెట్టి షాకిచ్చారు బిగ్ బాస్. దీంతో శ్రీముఖి, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, వితికా, వరుణ్, అలీలు నామినేట్ కాగా ఎవరు సేఫ్ జోన్‌లోకి వెళ్తారు…ఎవరు హౌస్‌ నుంచి బయటకు వెళ్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక ఈ వారం వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు హౌస్ నుంచి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు పలుమార్లు ఎలిమినేషన్‌ జోన్‌లోకి వెళ్లిన అదృష్టం కలిసొచ్చి చివరివరకు చేరుకుంది. అయితే కొన్నిరోజులుగా వితికా ప్రవర్తను గమనిస్తున్న నెటిజన్లు ఆమెను సాగనంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఓటింగ్‌లో వితికా మిగితా కంటెస్టెంట్‌ల కంటే చాలా వెనుకబడి ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్‌కు ఈ వారం ఛాన్స్ ఉంటే వితికతో పాటు శివజ్యోతి కూడా ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.

తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం తమన్నా సింహాద్రి, నాలుగో వారం రోహిణి, ఐదోవారం అషు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఆరోవారం ఎలిమినేషన్ ఎత్తివేయగా ఏడోవారంలో అలీ రాజా, ఎనిమిదో వారంలో శిల్పా చక్రవర్తి, తొమ్మదో వారంలో హిమజ, పదో వారంలో రవి, 11వ వారంలో పునర్నవి, 12 వారంలో మహేష్ విట్టా ఇలా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు.

big boss 3