బిగ్ బాస్ 3…రాహుల్ ఆర్మీ రెడీ..!

528
rahul army big boss
- Advertisement -

బిగ్ బాస్‌ 3 ముగియడానికి మరో రెండు వారాలు మాత్రమే ఉంది. ఇప్పటివరకు 89 ఎపిసోడ్‌లు పూర్తి కాగా ఈ వారం ఎలిమినేషన్‌లో హౌస్‌లోని 7 గురు సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం రాహుల్‌ 29 శాతం ఓట్లతో అగ్రస్ధానంలో ఉండగా వితికా 7 శాతం ఓట్లతో చివరి స్ధానంలో ఉంది.

ఇక బిగ్ బాస్ 2 సీజన్‌లో కౌశల్ ఆర్మీ గురించి అందరికి తెలిసిన సంగతి తెలిసిందే. కౌషల్ ఆర్మీ పేరుతో ఆయన్ని విజేతగా నిలిపేవరకు వారు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాహుల్ ఆర్మీ కూడా సిద్ధమైంది.

మూడో సీజన్ లో టైటిల్ కోసం హోరాహోరీగా తలపడుతున్న వారిలో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి పేర్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకోవడంతో వీరిని ఫాలో అవుతున్న వారు ఆర్మీల పేరుతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ముందువరుసలో ఉన్నారు రాహుల్.

రాహుల్ తన ముక్కుసూటి తనంతో దూసుకుపోతుండగా ఆయన పేరిట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పాతబస్తీకి చెందిన రాహుల్ కు ఓల్డ్ సిటీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని…అందుకే రాహుల్ సింప్లిగంజ్ ఆర్మీని ఏర్పాటుచేశామని రాహుల్ ఆర్మీ స్థాపకులు సోను తెలిపారు.రాహుల్ ని విజేతగా నిలిపి తీరుతామని చెబుతున్నారు.

- Advertisement -