ఇప్పుడు సింధు కాదు.. బిగ్‌బీ.

221
Big B replaces PV Sindhu as GST Brand Ambassador
- Advertisement -

దేశంలో పన్నుల సంస్కరణకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను తీసుకొస్తోంది. ఈనెల 30 అర్ధరాత్రి నుంచే జీఎస్‌టీని అమల్లోకి తేనుంది. ఈ నేపథ్యంలో దీనిపై మరింత ప్రచారం కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ని గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ 40 సెకన్ల వీడియోను రూపొందించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది.

ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పన్ను వసూలు విధానంలో తీసుకొచ్చిన ఈ నూతన పద్ధతిని ప్రోత్సహించేందుకు అమితాబ్ బచ్చన్ కృషి చేయనున్నారు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం అమితాబ్‌తో ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

 Big B replaces PV Sindhu as GST Brand Ambassador
ఇక అమితాబ్ బచ్చన్ జీఎస్టీని ప్రమోట్ చేస్తున్న ఓ వీడియోను తాజాగా సోషల్ మీడియా ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ షేర్ చేసుకున్నారు. అమితాబ్ జీఎస్టీని జాతీయ జండాలో వున్న మూడు రంగులతో పోలుస్తూ వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్ అని ప్రమోట్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు.

అమితాబ్ కన్నా ముందుగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ స్థానం కోసం ఎంపికయ్యారు. కానీ తాజాగా కేంద్రం ఆమె స్థానంలోనే అమితాబ్‌ని తీసుకుంది.

- Advertisement -