మాజీ రాష్ట్రపతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

140
Modi

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు నరేంద్ర మోదీ. ఎన్డీయో కూటమి రెండో సారి భారీ విజయాన్ని సాధించిన తర్వాత ప్రణబ్ ను మోదీ కలవడం ఇదే తొలిసారి. దేశ ప్రధానిగా ఈనెల 30న సాయంత్రం 7గంటలకు మోదీ ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని, బీజేపీ సీనియర్ నేతలను మోదీ మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే .

modi Pranab

ఈసందర్భంగా ప్రణబ్ ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. ప్రణబే స్వయంగా తన చేతులతో మోదీకి స్వీటు తినిపించారు. ఈవిషయాన్ని మోదీ తన ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రణబ్‌కు ఉన్న అపారమైన అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రణబ్‌ రాజనీతిజ్ఞుడు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. ప్రణబ్‌ ఆశీర్వాదం కోసం ఇవాళ ఆయనను కలిశానని మోదీ ట్వీట్‌ చేశారు.