- Advertisement -
ప్రపంచ దేశాలను మరోసారి కరోనా కలవర పెడుతోంది. యుకేలో కొత్త తరహా వేరియంట్ వివిధ దేశాలకు విస్తరిస్తుండగా భుటాన్ మరోసారి లాక్ డౌన్ బాటపట్టింది.ఇవాళ్టి నుంచి 7 రోజుల పాటు ఈ లాక్‌డౌన్ అమల్లోకి రానుంది.
లాక్‌డౌన్ సందర్భంగా అన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయనీ.. స్కూళ్లు, సంస్థలు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు మూసివేస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. రాజధాని థింఫూతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో… కోవిడ్ వ్యాప్తి పెరగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
థింపు, పారో, లామోయ్‌జింఘాలో కరోనా కేసులు వెలుగుచూడటంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మరోమారు లాక్‌డౌన్ విధించారు.అయితే ఇప్పటివరకు కరోనా వల్ల ఒక్కరు కూడా మరణించకపోవడం విశేషం.
- Advertisement -