హర్యానాలో బీజేపీకి ఇదే నష్టం చేయనుందా?

11
- Advertisement -

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం సాగుతోంది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా.

మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న అవమానం హర్యానాలో బీజేపీకి నష్టం కానుందని తేల్చి చెప్పారు. లోక్ సభ ఎన్నికలను పంచాయతీ ఎన్నికల మాదిరిగానే బీజేపీ చూస్తోందని…బీజేపీ సర్కార్ తీరుతో ప్రజలు విసిగిపోయారని ఇదే కాంగ్రెస్ సర్కార్ గెలిచేలా చేస్తుందన్నారు భూపీందర్ సింగ్ హుడా.

2019 లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ మొత్తం 10 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ సారి ఆ పరిస్థితి లేదని తెలిపారు భూపీందర్ సింగ్. హర్యానాలో గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు . తలసరి ఆదాయం, శాంతిభద్రతల పరిస్థితి, ఉపాధి లేదా ధరల పెరుగుదల వంటి అన్ని అంశాల్లో బీజేపీ విఫలమైందని…బీజేపీ హయాంలో తమకు భవిష్యత్తు లేదని యువత ధీమాగా ఉందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? యువతకు ఉపాధి హామీ ఇచ్చారా? రైతులకు ఎంఎస్పీపై హామీ ఇచ్చారా ? హర్యానా అంతటా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వెల్లడించారు.

ఏడాది పాటు జరిగిన రైతుల ఆందోళనలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయిన సంగతి ఇంకా మర్చిపోలేదన్నారు. యావత్ దేశం గర్వించదగ్గ మన బిడ్డలు…బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మల్లయోధులకు ఇంకా న్యాయం జరగలేదని…ఇదే బీజేపీ ఓటమికి నాంది కానుందని తెలిపారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -