క్రేజీ కాంబినేషన్‌…బాలయ్యతో భూమిక..?

640
balakrishna bhumika
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ తన 105వ సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తుండగా చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో కనిపిస్తుండగా ఒక పాత్రకు జోడీగా సోనాల్ చౌహాన్ కనిపించనుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ పాత్రలో హీరోయిన్‌ భూమిక నటించనుందనే వార్తలు వెలువడుతున్నాయి. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భూమిక….అమ్మ,అక్క,వదిన పాత్రలు చేస్తూ వచ్చింది. అయితే తాజాగా బాలయ్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఫ్లాష్ బ్యాక్ బాలయ్య పాత్రలో హీరోయిన్‌గా నటించనుందట. ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్‌ని ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది భూమిక. ఆమె చేసిన పలు సినిమాలు బాక్సాపీస్ వద్ద రికార్డు సృష్టించాయి. పవన్‌తో ఖుషి,చిరుతో జై చిరంజీవ,వెంకటేష్‌తో వాసు,నాగార్జునతో స్నేహమంటే ఇదేరా,ఎన్టీఆర్‌తో సింహాద్రి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

- Advertisement -