భూమన వర్సెస్ భాను ప్రకాష్..!

6
- Advertisement -

IAS శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కట్టే చీర ఖరీదు ఎంత? ఆమెకు వచ్చే జీతం ఎంత? అని ప్రశ్నించారు. TDR బండ్ల స్కాంలో శ్రీలక్ష్మి పాత్ర ఉంది అని ఆరోపించారు.

టీడీపీ నేతలతో కలిసి ఆమె రూ.వందల కోట్లు దోచుకున్నారు.. ఆమె ఒక అవినీతి అనకొండ , అవినీతితో వేల కోట్లు లూటీ చేసింది…శ్రీలక్ష్మి ధరించే చీర ఖరీదు రూ.లక్షన్నర అని మండిపడ్డారు.

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. మహిళపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?… ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎవరి వల్ల జైలుకు వెళ్లిందో తెలియదా? చెప్పాలన్నారు. TDR బాండ్స్ లో అక్రమాలు జరిగింది వాస్తవం కాదా?… మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు … ఓడిపోయిన తర్వాత భూమన రాజకీయ నిరుద్యోగిగా మారారు..భూమన మానసిక పరిస్థితి బాలేదు అని దుయ్యబట్టారు.

Also Read:శ్రీవారి సన్నిధిలో తిలక్ వర్మ

- Advertisement -