- Advertisement -
తేజా సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిరాయ్. ఇవాళ ఈ ఫాంటసీ డ్రామా ట్రైలర్ తాజాగా విడుదలై, అందరినీ ఆకట్టుకుంది.ట్రైలర్ లాంచ్ సందర్భంగా తేజ, మీడియా మరియు అభిమానులను తనను పాన్-ఇండియన్ నటుడు అని పిలవవద్దని కోరాడు.
తాను తెలుగు సినిమాలు చూసి పెరిగానని, ఇప్పటివరకు తెలుగు చిత్రాలలోనే నటించానని, ఇకముందు కూడా అలానే కొనసాగుతానని చెప్పి, ఇలాంటి బిరుదులు పెట్టకూడదని అభ్యర్థించాడు.
ఈ చిత్రంలో మంజు మనోజ్ విలన్‌గా నటించగా, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గౌర హరి సంగీతం సమకూర్చగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా 2025 సెప్టెంబర్ 12న పలు భాషల్లో విడుదల కానుంది.
Also Read:Mirai:’మిరాయ్’ ట్రైలర్
- Advertisement -

