అఖిల ప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..

252
Bhuma Akhila Priya Remand Report Details
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హఫీజ్‌పేట్‌ భూ వివాదంలో సూత్రధారి భూమా అఖిలప్రియగా పోలీసులు తేల్చారు.. ఈ కేసులో ఏ-1గా భూమా అఖిలప్రియను పేర్కొంటూ, ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు మార్పులు చేశారు. ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవ్‌రామ్‌, నిందితులుగా శ్రీనివాసరావు, సాయి,చంటి, ప్రకాశ్‌ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇక, రిమాండ్ రిపోర్టు విషయానికొస్తే.. ల్యాండ్ వ్యవహారంలో ఏవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందగా, ల్యాండ్ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2016లో ప్రవీణ్‌కుమార్‌ సర్వే నంబర్‌ 80లో 25 ఎకరాల భూమి కొన్నారు. అదే భూమి తమదంటూ ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవ్‌రామ్ లిటిగేషన్ పెట్టారు. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరగ్గా, చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్‌.. డబ్బు చెల్లించారు. సెటిల్‌మెంట్ విషయం తెలిసి అఖిలప్రియ మండిపడ్డారు

ఏవీ సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం చేసుకున్నారని అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు దగ్గర ఎలాగైన డబ్బు రాబట్టాలని అఖిలప్రియ దంపతులు ప్లాన్‌ వేశారు. సాయి అనే వ్యక్తితో కలిసి అఖిలప్రియ దంపతులు కిడ్నాప్ చేయించారు. కిడ్నాప్ తర్వాత ఓఆర్‌ఆర్‌ వద్ద ఖాళీ బాండ్‌ పేపర్‌పై కిడ్నాపర్లు సంతకాలు చేయించారు. సంతకాల సమయంలో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ పేర్లను కిడ్నాపర్లు ప్రస్తావించారు. సంతకాలు తీసుకునే సమయంలోకిడ్నాపర్లు కర్రలతో దాడి చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియను ముందే అదుపులోకి తీసుకోకుంటే.. సాక్ష్యాధారాలు తారుమారు చేసేవారని పోలీసులు భావించారు. అఖిలప్రియ, భర్త భార్గవ్‌రామ్‌కు నేర చరిత్ర ఉందని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులో అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు, ఏవీ సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అతడికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం చెన్నై, బెంగళూరు నగరాల్లో ప్రత్యేక పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. అఖిలప్రియకు ఈ వ్యవహారంతో సంబంధంలేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా, తనకే పాపం తెలియదని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నాడు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న భార్గవరామ్, అతడి సోదరుడు చంద్రహాస్ పట్టుబడితే ఈ వ్యవహారంలో స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -